గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు
గాంధీలో అనస్తిషియా విభాగం ఆధ్వర్యంలో సీఎంఈ ప్రొగ్రాం
సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు) :
వైద్యరంగంలో ఆత్యాధునిక పద్దతులు, నేర్చుకుని పేషంట్లకు మరింత మెరుగైన సేవలు అందించాలని పలువురు వైద్యనిపుణులు సూచించారు. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో అలుమ్నీ హాలులో శనివారం ఇన్‌సైట్స్ ఆఫ్ పెయిన్ మేనేజ్‌మెంట్ అంశంపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) సదస్సు నిర్వహించారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర, సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సీహెచ్‌ఎన్ రాజకుమారి లు ముఖ్యఅతిథులుగా హజరై జ్యోతి ప్రజ్వళన చేసి సదస్సును ప్రారంభించారు.
పెయిన్ మేనేజ్‌మెంట్ నిపుణులు మురళీధర్‌జోషీ, సుధీర్‌థార, నాగలక్ష్మీ, ఉమామహేశ్వరరావు, సచిన్‌లు అల్ట్రాసౌండ్, సియామ్ గైడెడ్, రేడియోఫ్రీక్వెన్సీ ఆఫ్ అబ్‌లేషన్, నొప్పి నివారణ కేంద్రంలో ఎటువంటి వైద్యసేవలు అందించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక వైద్యవిధానాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించి సందేహాలను నివృత్తి చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ పద్మావతి తనవంతు సాయంగా గాంధీ పెయిన్ క్లినిక్‌కు రూ. 20 లక్షల విలులైన అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్ మెంట్ ను డొనేట్ చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో గాంధీ అనస్టీషియా హెచ్‌ఓడీ ప్రొఫెసర్ ఆవుల మురళీధర్, ప్రొఫెసర్ కిరణ్ మాదల, అసోషియేట్ అబ్బయ్య, వైస్ ప్రిన్సిపాల్ రవిశేఖరరావులతోపాటు పలు ప్రాంతాల్లోని ఆసుపత్రులకు చెందిన 150 మంది అనస్టీషియా వైద్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
