తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!
మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు
గొల్లపల్లి (రాయికల్) జులై 01 (ప్రజా మంటలు):
తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారని మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు.మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శశికాంత్ రెడ్డి,డాక్టర్ సురేందర్,డాక్టర్ అనిల్,డాక్టర్ సృజన, డాక్టర్ ఉదయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ బెక్కం తిరుపతి,ఆర్.ఎం.పి మండలోజు శ్రీనివాస్ లను సాల్వాల,మెమోటోలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ,అమూల్యమైన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.అనంతరం నూతన లయన్స్ క్లబ్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా జెండా ఆవిష్కరించి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే, చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా రాయికల్ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగస్తులను, చార్టెడ్ అకౌంటెంట్లను సాల్వాల,మెమెంటో తో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్,ప్రధాన కార్యదర్శి బొడగం అంజిరెడ్డి రెడ్డి,కోశాధికారి బెక్కం తిరుపతి,ఉపాధ్యక్షులు వాసం స్వామి,మాజీ జడ్ సీలు బత్తిని భూమయ్య,మ్యాకల రమేష్, కాటిపెళ్లి రామ్ రెడ్డి,మాజీ అధ్యక్షులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,కొమ్ముల ఆదిరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు వాసం ప్రసాద్,కటుకం కళ్యాణ్, జిల్లాల సూర్యం,మోర రామ్మూర్తి,బాలే నిఖిల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
