సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

On
సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం - యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం
సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత

సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణిని అంతం చేయాలని చూస్తోంది
కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన విద్య, వైద్యం అందజేయాలి
సింగరేణి డీఎంఎఫ్ టీ నిధులను ప్రభుత్వం కొడంగల్, మధిర నియోజకరవర్గాలకు తరలించింది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత


హైదరాబాద్ మే 27:

సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలోని 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందన్నారు.

సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని వాటిని అడ్డుకుంటామన్నారు. సంస్థలో 40 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తుంటే వారిలో సగానికిపైగా యువకులే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కో ఆర్డినేటర్లను నియమిస్తున్నామని కవిత ప్రకటించారు.

సింగరేణి స్కూళ్లను పునరుద్దరించి సీబీఎస్ఈ సిలబస్ లో విద్యాబోధన చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయాలన్నారు. కార్మిక కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్టుల్లో ఎస్ డీ ఎల్ వెహికిల్స్ ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ఆ మిషన్లను ప్రైవేటు వాళ్ల తో నడిపిస్తున్నారని, ఇది ఓపెన్ కాస్టుల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అన్నారు.

వెంటనే ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించడం ఆపివేయాలన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డీఎంఎఫ్ టీ నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించుకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మధిరకు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ గారి నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణిని రక్షించుకున్నామని.. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోందన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 వేల కోట్లతో ప్రతిపాదిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే రూ.9 వేల కోట్లకు పెంచిందని అంటే సంస్థను తమ అవినీతితో ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో దెబ్బతీయాలని చూస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ఎక్స్ ప్లోజివ్స్ టెండర్లలోనూ భారీ అక్రమాలకు పాల్పడ్డారని, ఏకంగా టెండర్ ను మూడు రెట్లు పెంచారని తెలిపారు. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలోనే ఇంతటి అవినీతిని ఎప్పుడూ చూడలేదన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని సంస్థను ముంచేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కోసం పని చేస్తున్నాడని అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదన్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు జీఎం స్థాయిలో చేస్తారని.. సీఎం తన పబ్లిసిటీ స్టంట్ కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ హైదరాబాద్ కు పిలిపించి అపాయింట్ మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్యను పరిష్కరించి వారికి ఉద్యోగ అవకాశం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారి తరుపున సింగరేణి జాగృతి ఉద్యమిస్తుందన్నారు. రాజకీయ పార్టీలకు సింగరేణి అంటే తమ ప్రయోజనాలు మాత్రమేనని.. కార్మికులకు ఆ సంస్థే జీవితమని అన్నారు. వారందరి తరుపున తాము పని చేస్తామన్నారు. కార్మికుల కోసం తాను స్వయంగా బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల వరకు వచ్చి కూర్చొంటానని హామీ ఇచ్చారు. ఓపెన్ కాస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.IMG-20250527-WA0010

జాగృతి ఏరియా కో ఆర్డినేటర్ల నియామకం
1)    బెల్లంపల్లి – కిరణ్ ఓరం
2)    శ్రీరాంపూర్ – కుర్మ వికాస్
3)    మందమర్రి – ఎస్. భువన్
4)    రామగుండం1 – బొగ్గుల సాయికృష్ణ
5)    రామగుండం 2 – కె. రత్నాకర్ రెడ్డి
6)    రామగుండం 3 – దాసరి మల్లేశ్
7)    భూపాలపల్లి – నరేశ్ నేత
8)    మణుగూరు – అజ్మీరా అశోక్ కుమార్
9)    కొత్తగూడెం – వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్
10)    కార్పొరేట్ – వసికర్ల కిరణ్ కుమార్
11)    ఎస్ టీపీపీ పవర్ ప్లాంట్ – కె. రామ్మోహన్ చారి

Tags

More News...

Local News  State News 

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): పద్మారావునగర్‌లోని డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ సాయిబాబా టెంపుల్ ఆవరణలో జూన్ 8న మృగశిర కార్తె రోజున ఆస్తమా వ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధం ఇవ్వనున్నారు. ఈ ఆశ్రమంలో గత మూడు దశాబ్దాలకు పైగా ప్రజలకు అస్తమవ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని పంపిణీ చేస్తున్నట్లు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ కి ఆయువుపట్టు.. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్దాం.. పార్టీని బలోపేతం చేద్దాం.. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ పెద్ద పీట అని మంత్రి శ్రీధర్ బాబు భరోసా.  హైదరాబాద్ 28 మే (ప్రజా మంటలు) :  నేడు సెక్రటేరియట్ లో...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు  వీరసావర్కర్ జయంతి వేడుకలు

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు  వీరసావర్కర్ జయంతి వేడుకలు జగిత్యాల మే 28 ( ప్రజా మంటలు) స్వాతంత్ర్య సమరయోధుడు  మహనీయుడి వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తాలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ వీరసావర్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిషర్లను గడగడలాడించిన స్వాతంత్ర్య...
Read More...
Local News 

శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి.. చిలకలగూడ లో శాంతి కమిటీ సమావేశం సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో బుధవారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఏసీపీ కె శశాంక్ రెడ్డి మాట్లాడుతూ..ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకోవాలన్నారు.  పోలీసులకు సహకరించాలని, రూమర్లను నమ్మవద్దని...
Read More...
Local News 

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి.. హెల్త్ మినిస్టర్ కు నిరుద్యోగులు విజ్ఞప్తి సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు):   హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులల్లో   అడ్మినిస్ట్రేషన్ మేనేజర్లుగా శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాలను ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర వైద్య
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర... ప్రతి భారతీయుడు సైనికులకు మద్దతుగా నిలవాలి..   బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గొల్లపల్లి మే 28 (ప్రజా మంటలు): పహాల్గామ్ సంఘటన విషయంలో పాకిస్తాన్ తో  జరిగిన యుద్ధంలో భారత్ సైనికులు సాదించిన విజయానికి సంఘీభావం తెలుపుతూ గొల్లపల్లి మండల కేంద్రంలో  సంఘభావంగా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి జగిత్యాల మే 28(ప్రజా మంటలు  )   ఎల్ ఎల్ గార్డెన్ నుండి గుట్ట రాజరాజేశ్వర దేవాలయము వరకు గల  లింకు రోడ్డుకు   ఎమ్మెల్యే సంజయ్ ప్రారంబోత్సవ ము చేశారు., అట్టి కార్యక్రమములో శ్రీ సూర్య ధన్వంతరి దేవస్థానం కమిటి వారు కలిసి వేసే రహదారిలో మద్యలో నుండి శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముకు వెళ్లు ముఖ్యంగా...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ,

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ,   కొడిమ్యాల మే 28 (ప్రజా మంటలు)   తెలంగాణ  ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాల పంపిణీ చొప్పదండి నియోజక వర్గం లో  జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం లో  చొప్పదండి  శాసనసభ్యులు  మేడిపల్లి సత్యం తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  జగిత్యాల...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon
Read More...
Local News 

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ,

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ , జగిత్యాల/ వేములవాడ, మే 28 ( ప్రజా మంటలు)   తెలంగాణ  ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాల పంపిణీ వేములవాడ నియోజక వర్గం లో  జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం మరియు భీమారం మండలం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం లో  వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి...
Read More...
Local News 

ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల మే 28 (ప్రజా మంటలు)    పట్టణము లోని ఓల్డ్ హైస్కూల్ లో జగిత్యాల  ఐ ఎం ఏ మరియు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించి,పరీక్షల సరళిని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ... రోజు వారి జీవన విధానం,వ్యాయామం,వాకింగ్ ద్వారా ఆరోగ్యం గా ఉంటారు....
Read More...
Local News 

కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ సేవలందించేవారితో విద్యుత్ ఎస్ ఈ   సాలియా నాయక్  క్రమబద్ధీకరణ పై చర్చ

కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ సేవలందించేవారితో విద్యుత్ ఎస్ ఈ   సాలియా నాయక్  క్రమబద్ధీకరణ పై చర్చ    జగిత్యాల మే 28 ( ప్రజా మంటలు) పట్టణంలో పనిచేస్తున్న కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ సేవల అందించేవారితో   సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పోల్స్ అద్దె (Pole Rentals), అలాగే ఓవర్‌హెడ్ కేబుళ్ల నిర్వహణ మరియు క్రమబద్ధీకరణ అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఈ మాట్లాడుతూ, పట్టణంలో భద్రత మరియు నిర్వహణ...
Read More...