వాల్మీకి ఆవాసం లో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
*జగిత్యాల ఏప్రిల్ 20:* (ప్రజా మంటలు)
సేవా భారతి ఆధ్వర్యంలో జగిత్యాల లో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం ఉదయం 11 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి.
గ్రామీణ, నిరుపేద, నిరక్షరాస్య కుటుంబాలకు చెందిన బాలురకు క్రమశిక్షణతో కూడిన విద్య, వసతిని ఉచితంగా అందిస్తున్న వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల ప్రారంభంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సమాజంలో సామాజిక సమరసత ను పెంపొందించడంలో భాగంగా ఆవాస విద్యార్థుల బంధువులు, సమాజంలోని ఇతర ప్రముఖులంతా కలిసి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించుకుంటారు.
ఈ వ్రతాలలో సుమారు 200 కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ లోకేష్ జీ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి గొప్పదైన సనాతన ధర్మాన్ని, కుటుంబ విలువలను కాపాడుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా వాల్మీకి ఆవాస వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. అనంతరం స్వామివారి అన్న ప్రసాదము గా సామూహిక భోజనం ఏర్పాటు చేశారు.
తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆవాస అధ్యక్షులు జిడిగే పురుషోత్తం, డా. భీమనాతిని శంకర్,సభ్యులు లక్ష్మారెడ్డి,సంపూర్ణ చారి,మధుకర్,కైలాసం,సురేష్,శ్రీనివాస్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ

సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోలు... కలెక్టర్ సత్య ప్రసాద్
.jpg)
జాబితాపూర్ గ్రామంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే చే గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా పూలంగి సేవ, తులాభారం ,దీపాలంకరణ
.jpg)
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన కారు

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి
