విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి
చందయ్య పల్లిలో మిన్నంటిన రైతుల రోదనలు
బాధిత రైతులను ఆదుకోవాలని ప్రజల విజ్ఞప్తి
బుగ్గారం ఏప్రిల్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్య పల్లిలో మంగళ వారం ఉదయం నాలుగు గేదెలు (బర్రెలు) విద్యుత్ షాక్ తో మృత్యు వాత పడ్డాయి.
గేదెలను మంగళ వారం ఉదయం మేత కోసం మందకు తోల్క పోంగా చిన్నాపూర్ శివారులోని ఎనగంటి మల్లేశం పొలం వద్ద తెగి పడిన విద్యుత్ తీగలతో కరెంటు షాక్ తగిలి నాలుగు గేదెలు అక్కడి కక్కడే మృతి చెందాయి.
బియ్యాల చంద్రయ్య, చల్ల భూమక్క, గాదె లచ్చయ్య, చల్ల లచ్చయ్య అనే నలుగురు రైతులకు చెందిన నాలుగు గేదెలు ఒకేసారి - ఒకేచోట కరంట్ షాక్ తగిలి పంట పొలాలలో మృతి చెందడం పట్ల ఆ రైతుల రోదనలు మిన్నంటాయి.
వెటర్నరీ డాక్టర్ తిరుపతి గౌడ్, విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మ్యాన్ గిరి, చిన్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సిద్ధం సతీష్, జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారాం, బాధిత రైతులు, కారోబార్ శేఖర్, తదితరులు సందర్శించారు. పశు వైద్యాధికారి పంచనామ నిర్వహించారు. ఈ రైతులను ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని తోటి రైతులు, బుగ్గారం మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా విద్యుత్ శాఖ అధికారులు తగు భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
