భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం

On
భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం

నేటి నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు
 రెండు రెవెన్యూ బృందాల నియామకం -  ప్రత్యేక వెరిఫికేషన్ బృందాల ఏర్పాటు

 ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

బుగ్గారం మే 05 (ప్రజా మంటలు):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాతిపదికన జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండలంను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు
 
రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం రెండు రెవెన్యూ బృందాలను నియమించామని అన్నారు. ఈ బృందాలు షెడ్యూల్ ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో ప్రతి రోజు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. ప్రతి రోజు ఒక్కో బృందం ఒక గ్రామం చొప్పున రోజుకు రెండు గ్రామాలలో సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని ఆయన వివరించారు. 
   
 ఈ రెవెన్యూ సదస్సుల్లో  భూ రికార్డులలో సంబంధిత యజమాని పేరు తప్పులు,విస్తీర్ణం హెచ్చు తగ్గులు,
 వారసత్వ భూములు, భూస్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వేనెంబర్ మిస్సింగ్, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, సరిహద్దు సమస్యలు, పార్ట్ -బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు, పట్టా లేకుండా ప్రభుత్వ భూములు కబ్జా కలిగిన వివరాలు సేకరణ తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నారు.


భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు పరిష్కారం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు 

రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వమే నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందన్నారు.

అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి సహకారం అందించేందుకు వీలుగా దరఖాస్తులను వెంటది వెంట పరిశీలన జరిపేలా ప్రత్యేక వెరిఫికేషన్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. 
భూ సమస్యలు కలిగిన రైతులు, ప్రజలు ఈ సదస్సులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సూచించారు.

ఈనెల 5, 6  సోమ,  మంగళ వారాలలో యశ్వంత రావుపేట,  మద్దునూర్ గ్రామాలలో వేర్వేరు రెవెన్యూ బృందాలు రైతుల, ప్రజల నుండి భూ సమస్యలపై విజ్ఞాపన పత్రాలు స్వీకరించి పరిశీలించ నున్నారు.

ఈనెల 7, 8 బుధ, గురు వారాలలో శేకల్ల, సిరికొండ గ్రామాలలో, 9, 12 తేదీలు అనగా శుక్ర, సోమ వారాలలో గంగాపూర్, వెలుగొండ గ్రామాలలో రైతుల, ఆయా గ్రామాల ప్రజల నుండి భూ సమస్యలపై పిర్యాదులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం సమస్యలను పరిష్కరించ నున్నారు.  ఈనెల 13, 14 మంగళ, బుధ వారాలలో గోపులాపూర్, సిర్వంచ కోట, చిన్నాపూర్ గ్రామాల పరిధి భూ సమస్యలపై రైతుల, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, విచారణ జరిపించి చర్యలు చేపట్ట నున్నారు.  చివరగా ఈనెల 15, 16 వ తేదీ గురు, శుక్ర వారాలలో బుగ్గారం మండల కేంద్రంలోని రైతుల, ప్రజల నుండి భూ సమస్యలపై విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ప్రత్యేక విచారణ అనంతరం చర్యలు చేపట్టి రైతులకు, ప్రజలకు భూ సమస్యలు తీర్చ నున్నారు.

రెండు బృందాలుగా పర్యటన

బుగ్గారం మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ గా భూ భారతి ద్వారా రైతుల, ప్రజల భూ సమస్యల పరిష్కారం కోసం రెండు వేర్వేరు బృందాలను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  రెవెన్యూ బృందం - 1 గా బుగ్గారం తహసీల్దార్ యం. ఎ. మాజిద్, గిర్దావర్ -1 ఎన్.బాపురెడ్డి, రికార్డ్ అసిస్టెంట్ యం.స్వామి, జూనియర్ అసిస్టెంట్ కె.సుధాకర్, మండల సర్వేయర్ ఆర్.పరమేశ్వర్ లను నియమించారు. 
రెండో రెవెన్యూ బృందంగా ధర్మపురి తహసీల్దార్ సి.హెచ్.కృష్ణ చైతన్య, బుగ్గారం నాయబ్ తహసీల్దార్ పి.శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ సి.హెచ్.సురేందర్ రావు, జూనియర్ అసిస్టెంట్ పి.జనార్ధన్, రాయికల్ మండల సర్వేయర్ ఆర్.నవీన్ లను జిల్లా కలెక్టర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా తేదీలలో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు భూ సమస్యలపై తగు ఆధారాలతో సహా పిర్యాదులు అందజేసి సమస్యలను తొలగించు కోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 

 

హాజరు కానున్న మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ అడ్లూరి 


భూ భారతి చట్టం ద్వారా రైతులకు, ప్రజలకు ఏర్పడ్డ భూ సమస్యల పరిష్కారం కోసం పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా  గుర్తించిన బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలలో జరుగ నున్న రెవెన్యూ సదస్సులలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో పాటు జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.మధు సూదన్ తదితరులు హాజరు కానున్నారు.

Tags

More News...

Local News  State News 

గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన గుడుంబా బాధిత యువకులు గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండల కేంద్రంలో  అక్రమంగా గుడుంబా బట్టీలు కాస్తున్న వారి వలన గొల్లపల్లి పట్టణంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు గుడుంబా తాగి అనారోగ్యానికి గురి అయ్యి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని మరియు కొందరు దానికి గుడుంబా...
Read More...
Local News 

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని   బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం   గొల్లపెల్లి మే05 (ప్రజా మంటలు):  అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ పౌరాణికంలోనిరామాయణంలో రాముడి పాత్ర అంత కల్పితం అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాహుల్ మానసిక పరిపక్వతకు నిదర్శనం అని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం,విమర్శించారు.హిందుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగ చేసుకున్న రాహుల్...
Read More...
Local News 

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు): రానున్న జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్  అదం సంతోష్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లు  పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
Read More...
Local News 

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్ సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు) :   పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం  రిహాబిలిటేషన్ సెంటర్ లో  ఫిజియో థెరపి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి  అల్లు అరవింద్ పరామర్శించారు.   దాదాపు...
Read More...
Local News 

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం తొలగించాలని విద్యుత్ అధికారికి మహిళల వినతి పత్రం  గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ పక్కనే ఉన్న కాలనీవాసులు 11 కె.వి విద్యుత్ వైరులు ఇండ్లపై నుండి విద్యుత్ వైర్లతో బిక్కిబిక్కి మంటున్న కాలనీవాసులు ఆదివారం జరిగిన విద్యుత్ ప్రమాదం తెలిసిన విషయమే వెనుగుమట్ల వెళ్లే  11 కేవీ...
Read More...
Local News 

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  బుగ్గారం మండలం యశ్వంతరావు పేటలో భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ తో కలిసి హాజరు  బుగ్గారం, మే 05 (ప్రజా మంటలు)  భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్    భూ...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా      ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.     

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా      ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.                                                         జగిత్యాల మే 5(ప్రజా మంటలు ) సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటానని,వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు.సోమవారం  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన వయో వృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన అంశాల గోడ పోస్టర్లను,కరపత్రాలను...
Read More...
Local News 

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ 

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ                                                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113హైదరాబాద్ మే 5 (ప్రజా మంటలు)ఇటీవల ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం...
Read More...
Local News 

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ .                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113 జగిత్యాల మే 5 ( ప్రజా మంటలు)  సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని,ప్రాచీన కాలం నుండి శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగంలో భారత్ దేశమే అగ్రగామిగా ఉండేదని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113జగిత్యాల మే 5(ప్రజా మంటలు)జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్,  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు....
Read More...
Local News 

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపిన విడిసి, ఎండిసి రైతులు భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : చుక్క గంగారెడ్డి  బుగ్గారం ఏప్రిల్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా గుర్తించి సోమవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభించినందులకు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి...
Read More...
Local News 

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం నేటి నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు   రెండు రెవెన్యూ బృందాల నియామకం -  ప్రత్యేక వెరిఫికేషన్ బృందాల ఏర్పాటు   ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుగ్గారం మే 05 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాతిపదికన జగిత్యాల జిల్లాలోని...
Read More...