భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

On
భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

 

               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 

మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూ దార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక

 రాయికల్ మండల కేంద్రంలో   పద్మశాలి కళ్యాణ ఫంక్షన్ హాల్  వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
రాయికల్, ఏప్రిల్ -29(ప్రజా మంటలు)

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన  నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామా  దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. 

రాయికల్ మండలం లోని పద్మశాలి కళ్యాణ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్* జగిత్యాల ఎమ్మెల్యే   డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.

భూ భారతి చట్టం లోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ   తెల్ల కాగితాల పై కొనుగోలు చేసిన సాధా బైనామా భూముల పట్టాలు అందించాలని గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తుల పరిష్కారం పై ధరణిలో  అవకాశం లేనందున హై కోర్టు స్టే విధించిందని, పెండింగ్ సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టం సెక్షన్ 6 క్రింద ఆర్డిఓ లకు బాధ్యతలు అందించిందని అన్నారు.

చిన్న సన్న కారు రైతులు 2014 కంటే ముందు కొనుగోలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు మాత్రమే సాధా బైనామా పట్టా లభిస్తుందని అన్నారు. గడిచిన 12 ఏళ్ళలో సాధా బైనామా భూముల అనుభవంలో ఉన్న వారికి మాత్రమే దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అన్నారు.

భూ భారతి చట్టం ద్వారా పక్కగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని, రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉంటుందని అన్నారు. భూ భారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్ల పై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పిల్ చేసుకునే  అవకాశం ఉందని అన్నారు. 

వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసిల్దార్ విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్  చేస్తారని, నిర్ణీత గడువు 30 రోజుల లోగా  మ్యూటేషన్ పూర్తి చేయకుంటే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. 

భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూ దార్ కార్డు అందించడం జరుగుతుందని అన్నారు. 

కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల.ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ  గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ వల్ల ఇబ్బంది పడని రైతు ఎవరూ లేరని అన్నారు. 15 నెలల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి పేద ప్రజలకు న్యాయం జరిగేలా భూ భారతి చట్టం ప్రవేశ పెట్టారని అన్నారు.భూ భారతి చట్టం ప్రవేశం పెట్టడమే కాకుండా అధికారులను గ్రామాలకు పంపి భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. 

తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన సన్న ధాన్యం కు నేడు  యాసంగి సీజన్ లో కూడా ప్రభుత్వం క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్  అందిస్తుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో  జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి 
పి మధుసూదన్ రాయికల్ తహసిల్దార్ అబ్దుల్  ఖయ్యూం ఎంపీడీవో  చిరంజీవి  మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఏ ఎం సి .మార్కెట్ చైర్మన్, రైతులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...
Local News 

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): SSC -2025 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థల జ్యోతి, మానస, సూర్య స్కూల్స్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. 589 మార్కులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యా సంస్థగా సిద్ధార్థ విద్యా సంస్థ చరిత్ర సృష్టించింది. 580 మార్కుల పైగా...
Read More...
Local News 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం మరియు జడ్.పి.హెచ్.ఎస్ గోధూర్ పాఠశాలల యందు మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మోడల్ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలో 6 నుండి...
Read More...
Local News 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ హైదరాబాద్ ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు)  మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో జరిగే ధార్మిక కార్యక్రమాలలో భాగంగా బుధవారం స్థానిక ముషీరాబాద్ లో గల భవానీ శంకర దేవాలయం వేదిక గా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 33 మంది వటువులకు శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి తండ్రి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు ఇబ్రహీంపట్నంలో శ్రీకాంత్ రెడ్డి తండ్రి ని పరామర్శించారు త్వరితగతిన ఈ...
Read More...
Local News 

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో అతిపురతన మహదేవుని శివలయం పున ప్రతిష్ట మహోత్సవం లో భాగంగా నుతనం గా ఎర్పాటు చేస్తున్న ద్వజస్థంబ ఎర్పాటు కు గుడ్ల విజయ్ కుమార్- అనుష దంపతులు బుధవారం రుపాయలు 76 వేల  విరాళం...
Read More...
Local News 

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు): ఉపాధ్యాయుల కృషి వల్లే పదవ తరగతి  పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని డీఈవో కె. రాము అన్నారు.జగిత్యాల జిల్లా 98.2 శాతంతో నాలుగవ స్థానంలో నిలిచిన సందర్భంగా  జిల్లా విద్యాధికారి కె.రాముకిఎస్టియు టీ.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు  మచ్చ...
Read More...
Local News 

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా సికింద్రాబాద్, ఏప్రిల్ 30 ( ప్రజామంటలు): భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ స్టూడెంట్స్ బుధవారం విడుదల అయిన పదవతరగతి వార్షిక ఫలితాల్లో విజయ కేతనం ఎగురవేశారు. రోహిత్ మిశ్రా అనే విద్యార్థి 600 మార్కులకు గాను 556 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. తర్వాత ఆర్ .నిహారిక 600 మార్కులకు గాను 533...
Read More...
Local News 

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు):  పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థులు 100% ఫలితాలు సాధించి, మండల జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. 1. ఎనగందుల వర్షిని 586 2. సట్టా అక్షిత 566 3. జాసియ బేగం 560 4. అనిశ్విక్ 555 5. సైన్ల శ్రేష్ణ...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

 జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు):  పదవ తరగతి విడుదలైన ఎస్సెస్సి ఫలితాలలో మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలకు అత్యుత్తమ ఫలితాలు జగిత్యాల జిల్లాలో ఉన్న మొత్తం 6 మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలల నుండి 378 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందరూ ఉత్తీర్ణత సాధించి 100% ఉత్తీర్ణత శాతం సాధించడం విశేషం.ఈ సంవత్సరం అత్యధిక...
Read More...
Local News  State News 

నిరాశ్రయులకు అండగా పావని   *గొడుగులు, చెప్పుల పంపిణీ

నిరాశ్రయులకు అండగా పావని   *గొడుగులు, చెప్పుల పంపిణీ సికింద్రాబాద్, ఏప్రిల్ 30 ( ప్రజామంటలు): అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని పద్మారావునగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని బుధవారం సిటీలోని ఫుట్ పాత్ లపై నివసిస్తున్న వారికి ఎండనుంచి రక్షణ పొందేందుకు గొడుగులను అందచేశారు. అలాగే చెప్పులు లేక బాధపడుతున్నవారికి చెప్పులను ఇచ్చారు. అలాగే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ...
Read More...