సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా. బాబు జగ్జీవన్ రామ్
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. సామాజిక అసమానతలకు ఎదురు చెప్పుతూ, అణగారిన వర్గాల అభ్యుదయానికి పాటుపడిన సంఘసంస్కర్త అని విద్య, వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాల్లో కీలకంగా సేవలందించిన జగ్జీవన్‌రామ్ భారత సమాజ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు అన్నారు.
మనం కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సమానత్వం, సోదరత్వం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించాలని ఎస్పీ అన్నారు. ఆ మహానీయులను స్మరింస్తూ.. మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో డి సి ఆర్ బి డిఎస్పి సురేష్ , , డి సి ఆర్ బి, ఎస్ బి, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్అలీఖాన్, రఫీక్ ఖాన్,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్,వేణు మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా
