పది నెలల తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా హత్య కేసులో నిందితుల గుర్తింపు
జగిత్యాల ఏప్రిల్ 3(ప్రజా మంటలు)
తేదీ 14-06-2024 రోజున బీర్పూర్ గ్రామ శివారులో రోళ్ల వాగు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి చంపినారని, అప్పటి బీర్పూర్ పంచాయితీ కార్యదర్శి పుర్రే చిన్న నర్సయ్య బీర్పూర్ పోలీసు స్టేషన్ లో ధరకాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తులో భాగంగా, మొదట అనుమానంతో మృతుడి యొక్క కుటుంబ సభ్యులయిన చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణకు మృతదేహాన్ని చూపించినా కానీ వారు ఆ శవం అతనిది కాదని ఒక అనాధ శవంలాగా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మృతుడి యొక్క ఎముక భాగాలను డి ఎన్ ఏ పరీక్ష నిమిత్తం ఎఫ్ఎస్ఎల్, హైదరాబాద్ కు పంపి, చనిపోయిన వ్యక్తి అంకం లక్ష్మీనారాయణ, తండ్రి పేరు రాజం, 55 సంవత్సరాలు, నర్సింహులపల్లి గ్రామం గా గుర్తించి, ఈ విషయం నిందితులకు తెలియచేసినా కానీ వారిలో ఎలాంటి భాద లేకపోవడం మరియు మృతుడికి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపించాల్సిన కర్మ కాండలు జరిపించలేదు.
, మృతుడి చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణ ప్రవర్తన మీద అనుమానం ఉండటం తో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మొదట వారు నేరం అంగీకరించలేదు.
ఇట్టి వారికి ఎఫ్ఎస్ఎల్, హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఆధునాతన సాంకేతిక పరిజ్ణానం పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) టెస్ట్ కు మృతుడి చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణ ను పంపి ఆ టెస్ట్ ఫలితాల ద్వారా అంకం లక్ష్మినారాయణను హత్య చేసింది వారేనని నిర్ధారించుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, నిందితులు అంకం సాయికుమార్ తన తండ్రి అంకం లక్ష్మీనారాయణ రోజూ తాగి వచ్చి, ఏ పని లేకుండా గొడవ చేస్తున్నాడని ఉద్దేశంతో, మృతుడి యొక్క కొడుకు మరియు తన భార్య ఇద్దరు కలిసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చినారని నేరం ఒప్పుకోగా వారిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినారు.
ఈకేసును ధర్యాప్తు అధికారి పరిశోధించిన జగిత్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వై కృష్ణారెడ్డి ని జగిత్యాల డిఎస్పి రఘుచందర్ అభినందించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులుగా బీర్పూర్ తిరుపతి
గొల్లపల్లి జనవరి 12 (ప్రజా మంటలు):
బుగ్గారం మండల సర్పంచ్ ల ఫోరం ఎన్నికలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ సమక్షంలో సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి.మండలంలోనీ సర్పంచులు సమావేశమై మండల ఫోరం అధ్యక్షులుగా సర్పంచ్ బీర్ పూర్ తిరుపతి... ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి
ఇబ్రహీంపట్నం జనవరి 12(ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి హిందూ సేన ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఫోనుకంటి చిన్న వెంకట్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా
ఈ... ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొని విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులు తయారు చేసిన తినుబండారాలు, స్వీట్ల ను పరిశీలించి విద్యార్థులను అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం,
అడువాల జ్యోతి... జగిత్యాలలో C.C రోడ్ పనుల పరిశీలన: అక్రమ కట్టడాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ ఎల్ గార్డెన్ సమీపంలో నిధులు మంజూరైన సి.సి రోడ్ నిర్మాణ పనులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల నాణ్యత, వెడల్పు అంశాలపై ఆయన ఆరా తీశారు.
మున్సిపల్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన... జగిత్యాలలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జిల్లాలో ఒంటరిగా ఉన్న సీనియర్ సిటీజేన్స్(వృద్ధుల)కోసం బైపాస్ రోడ్డులో వయో వృద్ధుల సంక్షేమ శాఖ తరపున డే కేర్ సెంటర్ ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి బి.నరేశ్ మాట్లాడుతూ వృద్దులు సామాజికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ డే కేర్... అలిశెట్టి అక్షరాలు… సమాజ హితాన్ని కోరాయి
జగిత్యాల, జనవరి 12 (ప్రజా మంటలు):
అలిశెట్టి ప్రభాకర్ రచనలు కణికల వంటివని, ఆయన సాహిత్యం సమాజ హితాన్ని కోరుతూ ప్రజలను చైతన్యవంతులను చేసిందని సినీ కథా రచయిత, అలిశెట్టి జీవిత సాఫల్య పురస్కార గ్రహీత పెద్దింటి అశోక్ కుమార్ అన్నారు. యువతరానికి అలిశెట్టి సాహిత్యం నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం కళాశ్రీ... అలిశెట్టి ప్రభాకర్కు జగిత్యాలలో ఘన నివాళులు
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో ప్రజాకవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, ఉద్యమకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ప్రజల పక్షాన నిలబడి అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సమాజ మార్పు కోసం జీవితాంతం పోరాడిన అక్షరయోధుడిగా అలిశెట్టి ప్రభాకర్... మెట్టుగూడలో కాంగ్రెస్ మహా పాదయాత్ర ; GHMC ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్, కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ పాదయాత్ర GHMC ఎన్నికల్లో విజయం లక్ష్యంగా సాగింది.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, ప్రభుత్వ పథకాలను... సూరారం ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
ఎల్కతుర్తి డిసెంబర్ 11 ప్రజా మంటలు
ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీని కమిటీని ఆదివారం అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్ ఎల్కతుర్తి స్టేషన్ ఎస్ ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్లను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు.ఈ సమావేశంలో... నేరెళ్ల గ్రామంలో యువకుని ఆదృశ్యం
గొల్లపల్లి జనవరి 11 (ప్రజా మంటలు ):
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) నేరెళ్లలో కుటుంబంతో సోమవారం మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి మంద శంకరమ్మ నిజాంపేట్ ఫేజ్–3లో సంక్రాంతి కానుకల పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు నిజాంపేట్ ఫేజ్–3లో నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సమన్వయంతో నిర్వహించారు.ఈ సందర్భంగా నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఎం. బిక్షపతి యాదవ్, ఓబీసీ నిజాంపేట్... హైదరాబాద్లో స్కై ఫౌండేషన్ 292వ అన్నదాన కార్యక్రమం
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, నిరుపేదలకు 292వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరమంతా సంచరిస్తూ ఆకలితో ఉన్నవారిని గుర్తించి ఒక్కపూట భోజనం అందించారు.ఈ కార్యక్రమంలో ఫౌండర్ & ప్రెసిడెంట్ డా. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్... 