జేఏసీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణ పోరు యాత్ర
యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
భీమదేవరపల్లి ఏప్రిల్ 21 (ప్రజామంటలు) :
హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సహకారంతో డ్రగ్స్ నివారణ పోరు యాత్ర నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, డ్రగ్స్, మద్యం, పాన్ పరాక్ లాంటివి యువతను నాశనం చేస్తూ ఒక తరాన్ని తుడిచి పెట్టేస్తున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్, మద్యం లాంటి వ్యసనాలకు అలవాటు పడిన పిల్లల కుటుంబాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుందని, జలగలు రక్తాన్ని పీల్చినట్లు ఈ వ్యసనం కుటుంబ ఆర్థిక పరిస్థితులను పీల్చివేసి నాశనం చేస్తుందన్నారు. అదేవిధంగా పిల్లల యొక్క ఆరోగ్యం దెబ్బతిని, కుటుంబంలో ప్రశాంతత సంపూర్ణంగా నాశనం అవుతుందన్నారు. పోనీ వీటికి దూరంగా ఉందామంటే ఓ వైపు బెల్ట్ షాపులు, మరోవైపు గ్రామ గ్రామాన విస్తరించిన డ్రగ్స్ వల్ల గ్రామాలలో తీవ్ర సమస్య ఏర్పడిందన్నారు. తప్పనిసరిగా ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయాల్సి ఉందన్నారు. హుస్నాబాద్ జేఏసీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై పోరుయాత్ర చేపట్టడం అభినందనీయమని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమం మాణిక్యపుర్ ,గాంధీనగర్ మొదలుకొని రత్నగిరి మరియు రంగయ్యపల్లె,వంగర లలో జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం,హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి , భీమదేవరపల్లి మండలం జేఏసీ చైర్మన్ డ్యాగాల సారయ్య, నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, భీమదేవరపల్లె మండల ఏపిఎం దేవానందం,మరియు చెప్యాల ప్రకాష్, సతీష్, సదానందం, నాగమణి , కర్ణాకర్ బాలసుందర్ సీసీలు,ఉప్పుల కుమారస్వామి, మాట్ల వెంకటస్వామి ,గాండ్ల పద్మ ,దండు లక్ష్మి, శ్రీదేవి, షబానా , ఎదులాపురం తిరుపతి, ప్రొఫెసర్ వీరన్న నాయక్, తాళ్లపల్లి ఆశీర్వాదం, జగన్ ,ఐలయ్య మాజీ సర్పంచ్ రాజయ్య, తాళ్ల పెళ్లి కుమార్ , గ్రామాల మహిళా అధ్యక్షులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు
