ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు..
సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు ) :
ఈనెల 7న నిర్వహించ బోయే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ ఆధ్వర్యంలో శుక్రవారం బౌద్దనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ లో సన్మాహాక సమావేశం జరిగింది. ఈసందర్బంగా ఎంఎస్పీ డివిజన్ అద్యక్షుడు దేవందర్ ఆద్వర్యంలో నూతన ఎమ్మార్పీఎస్ జెండా గద్దే నిర్వాణ పనులను ప్రారంభించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేత్వత్వంలో మాదిగల లక్ష్య సాధనకై మూడు దశాబ్దాలకు పైగా పోరాడి ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నామన్నారు.
ఎమ్మార్పీఎస్ 31 వార్షికోత్సవంతో పాటు పద్మశ్రీ మందకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. సిటీలోని అన్ని డివిజన్ లల్లో నూతనంగా ఎమ్మార్పీఎస్ జెండా గద్దెలను నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎడ్ల రుద్ర,తుమ్మల శివప్రసాద్, డప్పు మహేశ్, హరి,నారాయణ, అరవింద్, మధు, వీరభద్ర, రాజేశ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
