మానవ సేవే మాధవ సేవ - ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఎప్రిల్ 20:
మానవ సేవే మాధవ సేవ అని, ఆపద్బాంధవులను ఆదుకోవడం కన్నా, ఉత్తమమైన సేవలు ఉండవని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణ కేంద్రంలోని బ్రాహ్మణ సంఘంలో ప్రజల సౌకర్యార్థం మంథనికి చెందిన గట్టు నారాయణ గురూజీ చొరవతో, సీతారామ సేవా సదన్ స్వచ్ఛంద సంస్థ వారి సౌజన్యంతో, బ్రాహ్మణ సంఘం, గాయత్రి నిత్య అన్నదాన సత్రం, అన్నపూర్ణ సేవాసమితి, సంయుక్త నిర్వహణలో నూతన ఆపత్కాల వాహన (అంబులెన్స్) సేవలను ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంఛనంగా నారికేళ ఫల సమర్పణతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... ధర్మపురి క్షేత్రంలో అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు కోసం ఇప్పటిదాకా అంబులెన్స్ సౌకర్యం అంతగా లేదని, మంథని సీతారామ సేవా
సదన్ వారి సౌజన్యంతో, బ్రాహ్మణ సంఘం, గాయత్రి నిత్య అన్నదాన సత్రం, అన్నపూర్ణ సేవాసమితి నిర్వహణలో నూతనంగా అంబులెన్స్ సౌకర్యం ప్రారంభించడం ముదావహమని, మూడు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను అభినందిస్తున్నామని అన్నారు. సదరు సేవలకు తన వంతు పూర్తి సహకారం అందించ గల నన్నారు. ధర్మపురి క్షేత్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు. 2027లో గోదావరి పుష్కరాలు రానున్న క్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించామని, త్వరలో ఉన్నత స్థాయి అధికారులతో హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని,
ఆలయ అర్చకులు, అధికారుల సూచనల మేరకు స్వామి వారి కళ్యాణాన్ని మొదటి సారి దేవస్థాన బయట నిర్వహించడం జరిగిందనీ, గోదావరిలో సివరాజ్ నీరు కలవకుండా సివరెజ్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటామని, ధర్మపురి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం, అన్నపూర్ణ సేవా సంస్థ, గాయత్రి నిత్యాన్న దాన సత్రం అధ్యక్ష కార్యదర్శులు కొరిడే దత్తాత్రి, దినేష్ ఇందారపు రామన్న, నందగిరి గిరిధర్, సంగనభట్ల నరేందర్, కరీంనగర్ డి సి ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్
సంగి సత్యమ్మ, గాజు భాస్కర్, విజయలక్ష్మి, నాగలక్ష్మి, సంతోషి , అరుణ, సౌజన్య, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ

సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోలు... కలెక్టర్ సత్య ప్రసాద్
.jpg)
జాబితాపూర్ గ్రామంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే చే గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా పూలంగి సేవ, తులాభారం ,దీపాలంకరణ
.jpg)
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన కారు

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
