దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి
గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళి అక్కడ ఇటీవల హత్యకు గురికాగ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుధవారం రోజున శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం వివరాలు అడిగి తెలుసుకోనీ 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శ్రీనివాస్ కుటుంబానికి అందజేసారు.
ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళిన శ్రీనివాస్ అక్కడ హత్యకు గురికావడం చాలా బాధాకరమని,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని,రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇండియన్ ఎంబెన్సీ అధికారులతో మాట్లాడి, శ్రీనివాస్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వం వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని,శ్రీనివాస్ కొడుకుకి అవుట్సోర్సింగ్ జాబ్ తో పాటు ఇందిరమ్మ ఇళ్లు,NRI పాలసీ కింద ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కూడా అందించే విధంగా చూస్తామని తెలిపారు.
వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
