తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి
తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి
చంద్రబాబు, పవన్ కల్యాణ్, కవిత సంతాపం
తిరుపతి జనవరి 09:
తిరుపతి తొక్కిలాట ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది.
రుయాలో నలుగురు, స్విమ్స్‌లో ఇద్దరు మృతి.
క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స
తిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీ
మూడు రోజులకు లక్షా 20 వేల టోకెన్లు జారీ
తర్వాత నుంచి రోజుకు 40 వేల టోకెన్ల జారీ
రోజుకు 70 వేల మందికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం
పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి . తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న సీఎం చంద్రబాబు. ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందనీ, మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను.
పవన్ కల్యాణ్ సంతాపం
మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను. అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు.
కల్వకుంట్ల కవిత సంతాపం
తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.
:
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
