వరదల్లో కొట్టుకపోయిన, తడిసిపోయిన పాస్ బుక్, ఆధార్ కార్డులకు కొత్తవి అందిస్తాం - సిఎం రేవంత్ రెడ్డి
వరదల్లో కొట్టుకపోయిన, తడిసిపోయిన పాస్ బుక్, ఆధార్ కార్డులకు కొత్తవి అందిస్తాం - సిఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం సెప్టెంబర్ 03:
ఖమ్మం జిల్లా ఆకేరు వాగు వరద ఉధృతి కారణంగా ఇళ్లల్లో నీరు చేరి పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికేట్స్ తడిచిపోయిన, పాడైన పోయిన వాటి విషయంలో ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ కొత్త కార్డులు, సర్టిఫికేట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను అదేశించారు.
* పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆకేరు వాగు వరద ఉధృతికి దెబ్బతిన్న ప్రాంతాలను, అక్కడి తండాలను పరిశీలించారు. సీతారాంపురం తండాలో బాధిత కుటుంబాలతో మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి భరోసానిచ్చారు.
* ఆకేరు వాగు పొంగిన ప్రతిసారీ సీతారాం తండాతో పాటు పక్కనే ఉన్న మరో రెండు తండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ మూడు తండాలను కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు అందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకేరు ప్రవాహం, నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనాలు వేసి కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
* వాగు ఉధృతిలో కొట్టుకుపోయి యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఆ కుటుంబానికి ఇల్లు లేదంటూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.