ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం
ఉద్యమకారుల ఐక్యం కావాలి - ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం.
సికింద్రాబాద్ జూలై 03 (ప్రజా మంటలు):
ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 300 మంది ఉద్యమకారులకు న్యాయం చేసి కెసిఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
ఎలాంటి స్వార్థం లేకుండా ఉద్యమాలు చేసిన నిస్వార్థపరులైన మొదటి ఉద్యమ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మరచి పోవద్దని, వారిని గుర్తించి న్యాయం చేయాలని జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు.
గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమావేశం జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు దీనస్థితిలో ఉన్నారని వారికి మార్గం చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
తెగించి కొట్లాడటానికి రోడ్డుమీదికి వచ్చి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకొని కేసులు ఉన్న ఉద్యమకారులను మొదటగా గుర్తించాలని సూచించారు. ఉద్యమ సమయంలో ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరారు. నాకోసం మీకోసం కాకుండా ఉద్యమకారులంతా ఐక్యం అయి ముందుకు వస్తే సీఎం దగ్గరికి తీసుకెళ్లి ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో రామగిరి ప్రకాశ్, రుద్ర శంకర్, ప్రపూల్ రామ్ రెడ్డి, మాంచాల వెంకటస్వామి, కుమారస్వామి, గోవర్ధన్,వశపాక నరసింహ, అంబు రాథోడ్, మోహన్ బైరాగి, ప్రసాద్, చాపర్తి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
.jpg)
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు జన్మదిన వేడుకలు

తొలి అంతర్జాతీయ వలస కార్మికుల మలేషియా సదస్సు.

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్
