ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆషాఢ మాస గోరింటాకు సంబురాల్లో ముఖ్యతిధిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సుంకే రవి కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సాదర స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, మొక్కలు నాటి, నోట్ బుక్స్ పంపిణీ చేసారు.సమస్యలపై ఆరా తీసి గోరింటాకు సంబురాల్లో పాల్గొన్నారు.
తదనంతరం కాంత కుమారి మాట్లాడుతూ, సన్నబియ్యంతో నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని విద్యార్ధులకు అందిస్తూ, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం పాఠశాలకు ఎంతో విశ్వాసంతో విద్యార్థులను పంపిస్తున్నారని, విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయి ఎదగాలని సూచించారు.
ఆషాఢ మాసంలో మహిళలు చేతులకు మైదాకు పెట్టుకోవడం ఆనవాయితీ అని, గోరింటాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, చిన్ననాటి నుండే సంస్కృతి సంప్రదాయా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని, ఏదైనా సమస్యలు ఉంటే మంత్రి దృష్టికి తీసుకెళ్తనని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు పాఠశాలకు 100% హాజరయ్యేలా చూస్తూనే 100% ఉత్తీర్ణత శాతం పెరిగేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రవిశంకర్, భోగ ప్రవీణ్, మామిడాల ప్రియాంక, ప్రధాన ఉపాధ్యాయుని ఉపాద్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కీ"శ కె. రోశయ్య జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
.jpg)
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
