మైనర్ బాలికను మోసం చేసిన యువకులపై కేసు నమోదు - ఇద్దరు నిందితులతో సహా మైనర్ బాలుని అరెస్ట్
మైనర్ బాలికను మోసం చేసిన యువకులపై కేసు నమోదు
ఇద్దరు నిందితులతో సహా మైనర్ బాలుని అరెస్ట్
జగిత్యాల మార్చ్ 26 (ప్రజా మంటలు) :
ప్రేమ, పెళ్లి పేర మైనర్ బాలికను లోబర్చుకొని, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసను చేసిన ఇద్దరు యువకులపి వివిధ నేరాలకింద కేసు నమోదు చేసినట్లు జగిత్యాల పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పీఎస్‌లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
బాధితురాలు మైనర్ బాలిక 10వ తరగతితో తన చదువును నిలిపివేసి, వారి ఇంట్లోనే ఉండిపోయిందని, 2018-19 సంవత్సరంలో ప్రేమ్ అనే వ్యక్తితో ఆమెకు స్నేహం ఏర్పడగా, ప్రేమ్ వారి స్నేహాన్ని దుర్వినియోగం చేసుకుని, ప్రేమ సాకుతో బలవంతంగా లోబర్చుకొని, ఆమెను గంజాయికి బానిశాను చేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజులకు మోజు తీర్చుకొని ఆమెను వదిలేయగా, గంజాయికి అలవాటుపడిన బాడితురాలు మరో వ్యక్తిత్వ పరిచయం పెనహకుకొని అదే తప్పుడు దారిలో వెళ్ళిందని, మరికొంత కాలానికి మరో మైనర్ బాలునితో సంబందాలు పెట్టుకొందని, ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆమెను నిలదీయడంతో ఆమె అసలు విషయం తల్లి దండ్రులకు తెలపడంతో, వారు ఆమెను మాడకద్రవ్యాల పోలీసులు తెలిపారు.
ఆమె మత్తుకు బానిసైందని, ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఆమెను మత్తుపదార్థాల, వ్యసనాల విముక్తి కేంద్రంలో చికిత్స కోసం చేర్పించారు. అక్కడి నుంచి ఆమెను ప్రభుత్వ సురక్షిత గృహంలోకి మార్చారు.
విచారణలో, తల్లిదండ్రులు, సిడబ్ల్యుసి అధికారులు, మత్తుపదార్థాల, వ్యసనాల విముక్తి కేంద్రం అధికారుల వాంగ్మూలాల ప్రకారం,నిందితులు ఆమెను మత్తులో బలవంతం చేసి, వివిధ ప్రదేశాలలో వేర్వేరు సమయాల్లో లైంగికంగా వేధించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.
నిందితులు ఆరెల్లి ప్రేమ కుమార్,సారపాక వెంకటేశ్ లతో పాటు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న(సీసీఎల్) బాలున్ని, పట్టుకొని వారి నుండి కొంత ఎండు గంజాయిని కూడ స్వాధీనం చేసుకొని, కోర్టులో ప్రవేశ పెట్టగా, ఇద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్ కు, ఒకరిని వారిని బాల నెరస్తుల కేంద్రానికి పంపినట్లు పోలీసులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు

శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు - ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి
-overlay.jpg.jpg)
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం
