గాంధీలో ఈఎన్ టీ వైద్యుల రాష్ట్రస్థాయి మహా సదస్సు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 19 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ / ఆసుపత్రి లో ఈఎన్‌టి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, గాంధీ మెడికల్ కాలేజ్ ఈఎన్‌టి విభాగం సహకారంతో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈఎన్‌టి వైద్యుల మహాసభ “AOI TG CON–2025” ఘనంగా జరగనుంది. సెప్టెంబర్ 20, 21 తేదీలలో రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలో రాష్ట్రం నలుమూలలతో పాటు దేశవ్యాప్తంగా పేరుపొందిన ఈఎన్‌టి నిపుణులు, వైద్యులు, పరిశోధకులు పాల్గొన నున్నారు.
చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులపై ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్సా సాంకేతికతలు, తాజా పరిశోధనలపై ప్రత్యేక చర్చలు జరుగనున్నాయి. అలాగే కొత్త టెక్నాలజీ, ఆధునిక పరికరాలు, వైద్య రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులపై వైద్యులు విశ్లేషణాత్మక ప్రసంగాలు చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహక కార్యదర్శి డా. జేబిఎస్ రాథోడ్ మాట్లాడుతూ – “AOI TG CON–2025 మహాసభ ద్వారా యువ వైద్యులకు కొత్త జ్ఞానం, శిక్షణ లభిస్తుంది. సీనియర్ నిపుణుల అనుభవాలను పంచుకోవడం ద్వారా వైద్య రంగానికి మరింత మేలుకలుగుతుంది” అని తెలిపారు.ఈ మహాసభ ప్రారంభోత్సవం సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 12:30 గంటలకు గాంధీ మెడికల్ కాలేజ్, అలుమ్ని ఎడ్యుకేషన్ సెంటర్ ప్రధాన ఆడిటోరియంలో జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కే.ఎన్.ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సలర్ డా. పి.వి. నంద కుమార్ రెడ్డి పాల్గొన నున్నారు.
గౌరవ అతిథులుగా డా. ఏ.నరేంద్రకుమార్ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ ప్రభుత్వం), డా. కె.శివరాం ప్రసాద్ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ – అకడెమిక్), డా. కె.ఇందిరా (ప్రిన్సిపాల్, గాంధీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్) మరియు డా. ఎన్.వాణి (సూపరింటెండెంట్, గాంధీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్) పాల్గొననున్నారు.
ఈ మహాసభ విజయవంతం కావడానికి నిర్వాహకులు డా. ఆనంద్ ఆచార్య ( ఆర్గనైజింగ్ చైర్మన్), డా. జేబిఎస్ రాథోడ్ (ఆర్గనైజింగ్ సెక్రటరీ), డా. ఎం.సాగర్ (ఆర్గనైజింగ్ ట్రెజరర్) ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య గ్లోబల్ పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు

దుర్గా నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష,1000/ రూపాయలు జరిమాన

హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: డీఎస్పీ రఘు చందర్

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
.jpg)
గతించిన మనిషి - గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు- అజాత శత్రువు నిజాం వెంకటేశం

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన సహస్ర

ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షునితో చాంద్ పాషా భేటీ

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం...రాజకీయం కాదు..

గాంధీలో ఈఎన్ టీ వైద్యుల రాష్ట్రస్థాయి మహా సదస్సు
-(1).jpg)