బహుళ అంతస్తుల భవనాలు,ఇతర నిర్మాణాల అనుమతులలో జాప్యం కూడదు సి ఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు):
బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతులు జారీ చేసే విషయంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, ఇతర అనుమతుల విషయంలో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా అలసత్వం చూపుతున్నారని మండిపడ్డారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో బిల్డ్ నౌ కింద పనుల అనుమతుల అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అనుమతుల జాప్యంలో ఆలస్యానికి కారకులను గుర్తించి వారిని సరెండర్ చేయాలని హెచ్ఎండీఏ కార్యదర్శిని ఆదేశించారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖ విభాగం అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, నాలాల, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్ సర్వేను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. సమగ్రమైన వివరాలున్నప్పుడు మాత్రమే ఎటువంటి వివాదాలకు తావుండదని అన్నారు.
ఈ విషయంలో జీహెచ్ఎంసీ (GHMC), హైడ్రా (Hydraa), ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషన్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
BRS నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావుకు పార్టీ మద్దతు!

బహుళ అంతస్తుల భవనాలు,ఇతర నిర్మాణాల అనుమతులలో జాప్యం కూడదు సి ఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు
-overlay.jpeg-overlay.png)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్ అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు

మా కామాఖ్య హాస్పిటల్ వారిచే ప్రెస్ క్లబ్ గణపతి వద్ద అన్నప్రసాద వితరణ

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
