భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి
జగిత్యాల ఆగస్ట్ 29 ( ప్రజా మంటలు)
నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
రాయికల్ పట్టణానికి చెందిన అరిపల్లి సత్తయ్య, సుధారాణి భార్యా భర్తలు వీరికి ఇద్దరు కుమారులు. సత్తయ్య ఇంటి వద్ద ఉంటూ ఏ పని చేయకుండా నిత్యం భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఇదే విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు కావడం జరిగింది.
ఈ యొక్క గొడవల కారణంగా సుధారాణి ఇంట్లో నుండి వెళ్లిపోయి వేరే దగ్గర కిరాయి ఉంటూ జీవనం కొనసాగించేది. సుధారాణి తన కొడుకుల బాగోగులు చూసుకుంటూ ఉండేది ఇది నచ్చని సత్తయ్య, సుధారాణి కి కిరాయి ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవను సృష్టిస్తూ, ఎలాగైనా చంపుతాను అని బెదిరిస్తూ ఆమెను చేతితో కొట్టేవాడు. సుమారు 5 నెలల అనంతరం కిరాయి ఇంటిని కాలి చేసి తన సొంత ఇంట్లో భర్తతో వేరుగా ఉంటూ జీవనం సాగిస్తూ ఉండేది. తేదీ 16-8-2020 రోజున సాయంత్రం 4 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ కాగా సత్తయ్య సుధారాణిని ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో పదునైన ఆయుధంతో సుధారాణి గొంతు కోసి హత్య చేయడం జరిగింది.
మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఆరోగ్యం నిందితుని పై కేసు నమోదు చేయగా రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్ ఇన్వెస్టిగేషన్ చేసి చార్జీ షీట్ దాఖలు చేసి నిందితుడు సత్తయ్య వయస్సు 57 సంవత్సరాలు ను కోర్టు లో హాజరుపరచగా సాక్షులను విచారించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి గారు నిందితునికి జీవిత ఖైదు తో పాటు 2500/- జరిమానా విధిస్తూ ఈరోజు తీర్పును వెలువరించారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ ... సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించు కోలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. పై కేస్ లో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీ.పీ మల్లికార్జున్ , అప్పటి ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్, ఎస్.ఐ ఆరోగ్యం, సీఎంఎస్ ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ నరేష్ మరియు సి ఎం ఎస్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ లను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
-overlay.jpeg-(1).jpg)
గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య

పాపం.. చిన్నారి తప్పిపోయింది.. *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది
