సైబర్ క్రైమ్ నేరాల నివారణ పై విద్యార్థులకు అవగాహన తప్పనిసరి సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ
జగిత్యాల ఆగస్ట్ 25 (ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక SKNR డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల నివారణ పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ...నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని విద్యార్థులకు వివరించారు. యువత ఎక్కువగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, బ్యాంకింగ్ యాప్‌లు, డిజిటల్ లావాదేవీలను వినియోగిస్తున్నందున వారిని టార్గెట్ చేస్తూ నేరస్తులు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
విద్యార్థులకు ముఖ్యంగా ఈ అంశాలపై అవగాహన కల్పించారు
సోషల్ మీడియా మోసాలు: తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు అంగీకరించకూడదని, వ్యక్తిగత ఫోటోలు, వివరాలను షేర్ చేయకూడదని సూచించారు.
ఆర్థిక మోసాలు:బ్యాంకు అకౌంట్, డెబిట్/క్రెడిట్ కార్డు, ఓటీపీ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.
ఫిషింగ్ / ఫేక్ వెబ్‌సైట్లు: అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
సైబర్ బుల్లీయింగ్
ఆన్‌లైన్ వేధింపులు ఎదురైనప్పుడు నిశ్శబ్దంగా ఉండకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
*మొబైల్ ఫోన్ భద్రత:* అవసరమైన యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఫోన్‌లో బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టాలని విద్యార్థులకు సూచించారు.
*Business & Investment Fraud* ఎక్కువ లాభాలు వస్తాయని చెబుతూ ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడతారు. తెలియని వెబ్‌సైట్లలో, యాప్‌లలో ఇన్వెస్ట్ చేయవద్దని విద్యార్థులకు సూచించారు.
*Part-Time Job Scams*
“సులభంగా డబ్బు సంపాదించండి” అనే పేరుతో మెసేజ్‌లు, యాప్‌లు పంపించి మోసాలు చేస్తున్నారు.
ఇలాంటి ఆఫర్లు నమ్మకూడదని, గుర్తింపు లేని యాప్‌లలో వివరాలు ఇవ్వొద్దని హెచ్చరించారు.
*Identity Theft Frauds* వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ కార్డ్ ఫోటోలు దొంగిలించి మోసాలకు ఉపయోగిస్తున్నారు. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.
*Loan Fraud – Fake Loan Apps* లోన్ ఇస్తామని చెప్పి ఫేక్ యాప్‌లు డౌన్‌లోడ్ చేయించి, తర్వాత వడ్డీ పేరుతో వేధింపులు చేస్తున్నారు. ప్లేస్టోర్ నుండి రిజిస్టర్ అయిన యాప్‌లు మాత్రమే వాడాలని సూచించారు.
*Advertisement Portal Frauds* OLX, Quikr, Facebook Marketplace లాంటి పోర్టల్స్ ద్వారా నకిలీ కొనుగోలు/అమ్మకాల మోసాలు చేస్తున్నారు.ముందుగా డబ్బు చెల్లించవద్దని, సరుకును చూసిన తర్వాతే డీల్ చేయాలని తెలిపారు.
*Online Safety Tips* పాస్‌వర్డ్ లు ఎప్పుడూ ఎవరికి చెప్పకూడదు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదు.సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు.తెలియని నంబర్ల నుండి వచ్చిన OTP, PIN, లింకులు షేర్ చేయకూడదు.
అలాగే సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్ లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. తక్షణం సమాచారం ఇవ్వడం వలన బాధితులు తమ డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, డీఎస్పీ సూచనలను గమనించి ఆచరణలో పెట్టాలని సూచించారు.
ఈ యొక్క కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
