సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్
*డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు
*మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్, ఆగస్టు12 (ప్రజామంటలు) :
సంచలనం రేపిన సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కు సంబందించిన కేసును ప్రభుత్వం నార్త్ జోన్ పోలీసుల నుంచి ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు బదిలీ చేసింది. ఇకనుంచి సీసీఎస్ ఆధ్వర్యంలో పనిచేసే సిట్ లోని పోలీస్ అధికారులు సృష్టి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తారు. ఈ విషయమై నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె సృష్టి కేసు లో తాము విచారణ జరిపిన అంశాలు, నిందితుల అరెస్ట్ ల గురించిన వివరాలను వెల్లడించారు.
తొమ్మిది కేసులు...25 మంది అరెస్టు....:
ఈ ఏడాది జూలై 27న సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై మొదటి కేసు నమోదైంది. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు సరోగసి పేరుతో మోసం చేసినట్లు డాక్టర్ నమ్రతపై కేసు నమోదు తర్వాత వరసగా బాధితులు గోపాల పురం పోలీస్ స్టేషన్ కు వచ్చి తాము మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఇప్పటి వరకు సృష్టి సెంటర్ డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు కాగా మొత్తం 25 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇల్లీగల్ సరోగసి, శిశువుల విక్రయం, సరోగసి మోసాల కేసులో అరెస్ట్ అయిన 25 మందిలో నలుగురు డాక్టర్లతో పాటు ల్యాబ్ టెక్నిషియన్స్, మేనేజర్స్,సూపర్ వైజర్స్,ఏజెంట్లు,బర్త్ పేరేంట్స్ లు ఉన్నారు.
డాక్టర్ సూరి శ్రీమతి డాక్టర్ పేరున లెటర్ ప్యాడ్ తీసుకొని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఐవీఎఫ్ కోసం సృష్టి సెంటర్ కు వచ్చిన పిల్లలు లేని దంపతులను మాయ మాటలు చెప్పిన డాక్టర్ నమ్రత ఇంకా ఎక్కువగా డబ్బులు వస్తాయనే దుర్బుద్దితో సరోగసి వైపు వారిని మళ్ళించినట్లు దర్యాప్తు లో గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. ఐవీఎఫ్ అయితే కేవలం రూ.లక్ష నుంచి రూ 2లక్షలు మాత్రమే వస్తాయని, అదే సరోగసి అయితే రూ 30 నుంచి రూ 40 లక్షల వరకు గుంజవచ్చని ప్లాన్ వేసిన డాక్టర్ నమ్రత ఈజీ మనీ కోసం చాలా దారుణాలకు ఒడిగట్టినట్లు బాధితుల ఫిర్యాదులతో వెలుగు చూసింది. శిశువుల కొనుగోళ్ళ విషయంలో ఆడపిల్లలకు రూ 3లక్షలు, మగపిల్లలకు రూ 4 లక్షలు ఏజంట్లకు ఇస్తారని తెలిసింది. ఒక జంటకు సరోగసి పేరుతో డబ్బులు తీసుకొని, చనిపోయిన శిశువును ఇచ్చారు. మళ్ళీ ప్రాసెస్ కోసం మరో రూ15 లక్షలు అవుతాయని అని చెప్పారని దంపతులు ఫిర్యాదుచేశారు.
మరో దంపతులకు వేరే వారి పిల్లలను కొనుగోలు చేసి, సరోగసి చేసినట్లు నమ్మించి వారి నుంచి దాదాపు రూ 40 లక్షలు వసూలు చేశారు. కాని ఇచ్చిన బాబు డీఎన్ఏకు పేరేంట్స్ డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో సృష్టి మోసాల పుట్ట బట్టబయలైంది. అలాగే తన మెడికల్ లైసెన్స్ నెంబర్ తో పాటు, తన పేరుతో లెటర్ హెడ్స్ ను డాక్టర్ నమ్రత తనకు తెలియకుండా అక్రమంగా వాడుతోందని ఓ సీనియర్ గైనకాలజిస్ట్ ఫిర్యాదు చేశారు. వైజాగ్ కు చెందిన డాక్టర్ విద్యుల్లత తో పాటు డాక్టర్ రవి, డాక్టర్ ఉషను అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. సికింద్రాబాద్ లోని ఉన్న ఆసుపత్రిని కేవలం కన్సల్టెన్సీగా వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఇక్కడ ఐవీఎఫ్ పేరుతో శాంపిల్స్ తీసుకుంటూ, మిగితా సరోగసి ప్రాసెస్ అంతా వైజాగ్ లో నిర్వహించినట్లు తెలిపారు. బాధితుల్లో ఒక ఎన్ఆర్ఐ జంట కూడ ఉండగా, వీరినుంచి భారీ మొత్తంలో డాక్టర్ నమ్రత డబ్బులు వసూలు చేసింది. మహిళా నిందితుల్లో చాలా మంది అండాలు అమ్ముకున్న వారు ఉండగా, మరికొందరు సరోగసి తల్లులుగా నటించిన వాళ్ళు ఉన్నట్లు తెలిపారు. ఎవరైన దంపతులు సరోగసి కోసం సెంటర్ కు అప్రోచ్ అవగానే వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత ఒక ఫేక్ అల్ర్టా సౌండ్ రిపోర్టు పంపుతారని, సరోగసి పద్దతిలో మీకు పుట్టబోయే పాప అంటూ స్కానింగ్ రిపోర్టు కూడ ఇస్తారని తెలిపారు. అదే సమయంలో నమ్రత ఏజంట్లు ఓ గర్బిణీని వెతికి పెడతారు. తొమ్మిది నెలల తర్వాత వైజాగ్ లో డెలివరీ చేసి, ఆ శిశువును సరోగసి ద్వారా పుట్టిన పాప అని దంపుతులను పూర్తిగా నమ్మించి, అప్పగిస్తారు.
ఇలా దాదాపు 50కి పైగా నకిటీ సరోగసి మోసాలు జరిగినట్లు తెలిసింది. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తే మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయన్నారు. డాక్టర్ నమ్రత మోసాలకు సంబందించిన 2010 నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయని డీసీపీ తెలిపారు.
-
అరెస్ట్ అయిన 25 మంది వీరే:
సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఓనర్ డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు, అడ్వకేట్ జయంత్ కృష్ణ, వైజాగ్ బ్రాంచీ మేనేజర్ కళ్యాణీ అచ్చాయమ్మ, ల్యాబ్ టెక్నిషియన్ చెన్నారావు,గాంధీ ఆసుపత్రి అనిస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్గుల సదానందం, ఏజంట్లు ధనశ్రీ సంతోషి,నందిని,బాబును విక్రయించిన దంపతులు అలీ అదిక్,నస్రీన్ బేగం,ఏజంట్ హర్షరాయ్,సూపర్ వైజర్ పవన్ మోహన కృష్ణ,నర్సు సురేఖ,ఏజెంట్ ఆషాబేగం,ఏజంట్ నయన్ దాస్,డాక్టర్ విద్యుల్లత,సబ్ ఏజంట్ షాహినా, గైనకాలజిస్ట్డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ రవి, జూనియర్ ఎంబ్రాలజిస్ట్ రమ్య,సబ్ ఏజెంట్ లు రత్నం,మీనాక్షి,మెయిన్ ఏజంట్ సరోజ,బర్త్ పేరేంట్ కరుణశ్రీ,సబ్ ఏజంట్ లు విజయ్ కుమార్, యమున లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
