మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ శ అశోక్ కుమార్
జగిత్యాల ఆగస్ట్ 12 ( ప్రజా మంటలు)
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 27 లక్షల విలువగల 144 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 27 లక్షల విలువగల 144 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1268 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు.
సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారుల ను ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు.
అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.
ఈ సందర్భంగా సాంకేతిక ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ CEIR టీం హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లుఅజర్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.సాంకేతిక ఉపయోగించి పోయిన సెల్ఫోన్ల ను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ కి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
*ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు నూతన పద్ధతులను ఉపయోగించి వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిపై అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.*
ఆన్‌లైన్ డెలివరీ మోసాలు* – అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీల ప్రత్యేక ఆఫర్ రోజులలో ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవడం, నకిలీ వెబ్‌సైట్లు ద్వారా మోసాలు జరుగుతున్నాయి. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా బలవుతున్నారు. అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారానే ఆర్డర్ చేయాలి.
*లోన్ మోసాలు*– రైతులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని నకిలీ లోన్ యాప్స్, వ్యక్తులు తప్పుడు వాగ్దానాలతో డబ్బు మోసం చేస్తున్నారు. అనుమతి లేని యాప్స్‌కు లేదా అపరిచితులకు వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దు.
*నకిలీ కస్టమర్ కేర్ మోసాలు* – వ్యాపారులు, స్వయం ఉపాధి దారులు నకిలీ హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి OTP, బ్యాంక్ వివరాలు చెప్పడం వల్ల భారీ నష్టాలు చవిచూస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ లేదా బిల్లులోని నంబర్లను మాత్రమే ఉపయోగించాలి.
. *స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు* – స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని చెప్పి నకిలీ యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా మోసగాళ్లు డబ్బు దోచుకుంటున్నారు. అధికారికంగా నమోదు అయిన బ్రోకరేజ్ సంస్థల ద్వారానే పెట్టుబడి పెట్టాలి.
5. *పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలు* – ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో తప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాల కోసం గుర్తింపు ఉన్న ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ఉపయోగించాలి.
ప్రజలు ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి.
ఈ యొక్క కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ , CEIR టీం హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ అజర్ ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు
Published On
By From our Reporter

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు
Published On
By From our Reporter

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ
Published On
By From our Reporter

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
Published On
By From our Reporter

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్
Published On
By Siricilla Rajendar sharma

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Published On
By From our Reporter

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ
Published On
By From our Reporter

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.
Published On
By From our Reporter

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్
Published On
By From our Reporter

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
Published On
By From our Reporter
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
Published On
By From our Reporter
