స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత

On
స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ కి కరప్షన్ గనిగా మారిన సింగరేణి - దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాం
హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత చర్చలు
హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుంది సింగరేణి కార్మికులకు 37 శాతం బోనస్ ప్రకటించాలి సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ ఆగస్ట్ 10 (ప్రజా మంటలు):

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కరప్షన్ గనిగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగ నియామకాలతో సహా అన్నింట్లో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ అంచనా వ్యయాలను రాత్రికి రాత్రే అమాంతం పెంచారని దుయ్యబట్టారు.

సింగరేణిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ సింగరేణిలో రాజకీయ అవినీతిని అంతం చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ అవినీతి పెరిగిందని స్పష్టం చేశారు. కాబట్టి సింగరేణి సంస్థ కేంద్ర విజిలెన్స్, సీబీఐ పరిధిలోకి వచ్చే విధంగా సంస్థ మారాలని అభిప్రాయపడ్డారు. కార్మికులకు భరోసా ఇవ్వడానికి త్వరలో సింగరేణి యాత్ర చేపడుతామని ప్రకటించారు. ప్రశ్నిస్తే ఉద్యోగాలను తీసేసే దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, దానికి అడ్డుకట్టవేస్తామని తేల్చిచెప్పారు.

IMG-20250810-WA0009

ఆదివారం నాడు బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత మధ్య కీలక చర్చలు జరిగాయి. తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ అయిన సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ సంఘం కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ... సింగరేణి ప్రాంతం మినీ ఇండియాగా మారిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణిని కాపాడుకోవాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఇప్పుడు దాదాపు 40 వేల మంది ఉద్యోగులతో సింగరేణి కలకలలాడుతోందని అన్నారు. ఏటా ఐదు గనులు తెరిచినా కూడా 185 గనులు తెరిచేంత బొగ్గు నిల్వలు తెలంగాణ భూగర్భంలో ఉన్నాయని చెప్పారు.

సింగరేణిలో అండర్ గ్రౌండ్ మ్యాన్యువల్ గనులను తెరవాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పెద్ద వాళ్లకే లాభమవుతుందని, పైగా కాలుష్యం తీవ్రమవుతోందని అన్నారు. సగటున ఒక్కో సింగరేణి కార్మికుడు రోజుకు ఆరు టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తారని, అంటే ఒక్కో కార్మికుడు రోజుకు దాదాపు రూ 30 వేలను ప్రభుత్వానికి సంపాదించిపెడుతున్నారని వివరించారు. కానీ సింగరేణి కార్మికులు ప్రభుత్వం ఇచ్చేది చాలా తక్కువగా ఉంటుందని, పైగా జీతంపై ప్రధాని మోదీ ఆదాయపు పన్ను కూడా విధిస్తున్నారని మండిపడ్డారు.

సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం కోసం కేసీఆర్ సింగరేణి కార్మికులకు  రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇప్పించారని పేర్కొన్నారు. 22 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైలేవల్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సంక్షేమం ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తామని తెలిపారు. కార్మికుల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతామని స్పష్టం చేశారు. గత బోనస్ విషయంలో కార్మికులను కాంగ్రెస్ పార్టీ నయవంచనకు గురి చేసిందని, లాభాల్లో 33 శాతం వాటా బోనస్ గా ఇస్తున్నామని చెప్పి అసలు లాభాలనే తక్కువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు ఏడాది దసరాకు బోనస్ గా లాభాల్లో 37 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.IMG-20250810-WA0007

హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత చర్చలు

హెచ్ఎంఎస్ కార్మిక సంస్థ సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అని, బ్రిటీష్ హయాంలో కార్మికుల కోసం పోరాడడానికి ఏర్పాటు చేసిన సంస్థ అని, అది ఇక్కడ స్వతంత్రంగా పనిచేస్తోందని వివరించారు. హెఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అనేక కార్మిక ఉద్యమాలు చేపట్టారని, సింగరేణి కార్మికుల కోసం కొట్లాడి అధిక బోనస్ సాధించడంలో కీలక పాత్రపోషించారని కొనియాడారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.  ఈ కలయిక భవిష్యత్తులో అన్ని వామపక్ష పార్టీల అనుబంధ సంఘాల ఐక్యతకు దారితీస్తుందని చెప్పారు. కాగా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్)  తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని, కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు కలిసి పనిచేయాల్సిందేనని వివరించారు.

Tags

More News...

Local News 

ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు)  అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక 

ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు)  అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక  ధర్మపురి ఆగస్టు 13 (ప్రజా మంటలు): ధర్మపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మధు మహాదేవ్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు కిషన్  ఎన్నికయ్యారు. స్థానిక కర్నె అక్కపెళ్లి కళ్యాణమండపంలో  రాష్ట్ర నాయకులు జె.సురేందర్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ సంగనభట్ల రామకృష్ణయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాలచారి,ఆధ్వర్యంలో ఐ జే యు జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటీ...
Read More...
National  State News 

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు పాట్నా ఆగస్ట్ 12:మంగళవారం (ఆగస్టు 12, 2025)న విడుదల చేసిన ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, కొత్తగా ఓటర్ల నమోదు కోసం దాదాపు 64,000 దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. బీహార్ SIR: కొత్తగా దరఖాస్తులు దాఖలు చేస్తున్న ఓటర్లు డ్రాఫ్ట్ రోల్స్‌లో లేరా లేదా మొదటిసారి ఓటర్లా అనేది EC డేటా అస్పష్టంగా ఉంది...
Read More...
Local News 

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి సికింద్రాబాద్, ఆగస్టు 12 (ప్రజామంటలు): రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గంలో కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్బంగా రాష్ర్ట బీజేపీ అద్యక్షులు రాంచందర్ రావు మర్రి పురూరవరెడ్డికి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తార్నాక లోని ఆయన నివాసంలో మర్రి పురూరవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.రాంచంద్రరావు...
Read More...
National  Local News  State News 

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు సికింద్రాబాద్,  ఆగస్టు 12 (ప్రజా మంటలు)::ట్రాఫిక్ పోలీసులు మరొక చెట్టుకు పునర్జన్మ ఇచ్చారు. మహాంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాట్నీ జంక్షన్ సమీపంలో  ఉన్న ఓ పెల్టో ఫోరం చెట్టు కు సంబందించి విస్తరించిన కొమ్మల కారణంగా వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దాంతో ట్రాఫిక్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నార్త్...
Read More...

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025  విద్యా సంవత్సరానికి గాను నిర్వహించబడే డిప్లమా  ఇన్ మ్యాజిక్ కోర్సులో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని వర్సిటి రిజిస్ర్టార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు , ఔత్సహిక కళాకారులు తమ దరఖాస్తులను విశ్వవిద్యాలయంలోని సంబంధిత శాఖలో సమర్పించి నేరుగా...
Read More...
National  Local News  State News 

సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్ *డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు*మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ సికింద్రాబాద్, ఆగస్టు12 (ప్రజామంటలు) : సంచలనం రేపిన సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కు సంబందించిన కేసును ప్రభుత్వం నార్త్ జోన్ పోలీసుల నుంచి ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు బదిలీ చేసింది. ఇకనుంచి...
Read More...
Local News  State News 

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్ శస్త్రచికిత్స లేకుండా  ప్రోస్టేట్ క్యాన్సర్‌, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యకు విప్లవాత్మక చికిత్స సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) :  తూర్పున ఫిలిప్పీన్స్ నుంచి పడమరలో టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో, తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధపడుతున్న రోగులను విజయవంతంగా చికిత్స చేసిన తొలి ఆసుపత్రిగా...
Read More...
State News 

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్ హైదరాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) : మిసెస్ క్రియేటీవ్–2019 మిసెస్ లావణ్య అదారి తన కలల డిజైనర్ బోటిక్ షాపును మంగళవారం సిటీలోని అత్తాపూర్ లో విజయవంతంగా లాంచ్ చేశారు. మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో పేరుతో ప్రాంభించిన బోటిక్ లో బ్రైడల్ కు సంబందించిన ఫ్యాషన్ దుస్తులు, చిక్ వెస్ర్టన్ ఔట్ ఫిట్స్,...
Read More...
Local News 

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ పనుల పురోగతిని పరిశీలించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం   ఇబ్రహీంపట్నం ఆగస్టు 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట్ 33/11కేవీ సబ్స్టేషన్ లో సామర్థ్యానికి మించి లోడు నమోదు అవుతున్న దృష్ట్యా రూ.85 లక్షలతో అదనపు 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ మంజూరి కావడం, మూడు రోజుల క్రితం సబ్స్టేషన్ కు  పంపించారు....
Read More...
Local News  State News 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు  హైదరాబాద్ ఆగస్ట్ 12: కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ సెక్షన్లలో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా  ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. నవాబుపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి రూ.15 వేల రూపాయలు సుజాత డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుని తీసుకుంటుండగా పట్టుకొన్నారు.
Read More...
State News 

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి  అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 12: గ్రేటర్ హైదరాబాద్లో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రానున్న మూడ్రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండటంతో...
Read More...
National  State News 

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం ₹18,541 కోట్ల విలువైన ప్రణాళికలను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్  న్యూ ఢిల్లీ ఆగస్ట్ 12:   'నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు, లక్నో మెట్రో విస్తరణ', ₹18541 కోట్ల విలువైన ప్రణాళికలను కేబినెట్ ఆమోదించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో, ₹18,541 కోట్ల విలువైన ప్రణాళికలను ఆమోదించారు. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర్...
Read More...