ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ
జగిత్యాల / బీర్పూర్ జులై 25 (ప్రజా మంటలు) :
ప్రీస్కూల్ యాక్టివిటీస్ తో చిన్నారి పిల్లలకు మెరుగైన మేధాశక్తి పెరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ అన్నారు. శుక్రవారం ధర్మపురి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని బీర్పూర్ మండలం చిత్రవెనిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కలర్స్ థెరపీ పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు కలర్ను పిల్లలకు ఎప్పటికీ గుర్తుండకై కలర్స్ థెరఫీ పరిచయంకై పిల్లలు టీచర్లు అందరూ ఎరుపు రంగు దుస్తులు ధరించికొని ఎరుపు రంగులో ఉన్నా పండ్లు, కూరగాయలు, వివిధ రకాల ఎరుపు రంగు వస్తువులతో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శైలజ మాట్లాడుతూ శ్రావణమాసం మొదటి రోజున అమ్మవారి పూజ కార్య క్రమం నిర్వహించడం ఎంతో ఆనందదాయకం అని అన్నారు.
శ్రావణ మాసం ప్రారంభంలోనే పిల్లలు, తల్లులు తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణంలో మార్పులు ఏర్పడి వర్షాల ప్రభావంతో కలుషిత నీరు , దోమలు , క్రిములతో అనారోగ్య పరిస్థితిలకు ఎక్కువ దారితీస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు గోరువెచ్చని నీళ్లను త్రాగించాలి అదేవిధంగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి అని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో ప్రతినెల ప్రణాళిక ప్రకారం సిలబస్ నిర్దేశించి వారికి మంచి ఆహారతో పాటు ప్రీ స్కూల్ విద్యను నేర్పిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లివిన్ కుమార్, ఆదిత్య రాజ్ , అంగన్వాడీ టీచర్లు సీతు బాయీ , హనుమక్క, సుమలత , అంగన్వాడి ఆయాలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
