దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ
సికింద్రాబాద్,జూలై 26 (ప్రజా మంటలు):
దివ్యాంగులకు సమగ్రమైన ఆరోగ్య సంరక్షణను అందించడం అనే అంశంపై భాగంగా శనివారం నాడు గాంధీ మెడికల్ కళాశాలలో వైద్య నిపుణులకు శిక్షణ అందించారు. కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రొఫెసర్ డా.కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగతకు అతీతమైన సామర్థ్యాలు సమగ్ర మరియు స్థిరమైన రేపటి కోసం సమగ్ర రోడ్ మ్యాప్ అనే థీమ్ తో సీపీడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర మాట్లాడుతూ... వైద్యులకు వృత్తిపరమైన శిక్షణ ఎంతో అవసరమని అన్నారు. సేవా భావంతో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కమ్యూనిటీ డిపార్ట్మెంట్ వారిని అభినందించారు. కమ్యూనిటీ మెడిసిన్ సైకియాట్రి సైకాలజీ విభాగాల నుండి పలువురు వక్తలు కార్యక్రమాల్లో పాల్గొని సమాజం మొత్తం భాగస్వామ్యంగా ఉండే విధంగా ఆరోగ్య విధానాలు మానసిక ఆరోగ్యం మరియు కమ్యూనిటీ స్థాయిలో దివ్యాంగుల మద్దతు గురించి విలువైన అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లు డాక్టర్ రాజారామ్ డాక్టర్ రవి శేఖర్ రావు ఎస్ పిఎం డిపార్ట్మెంట్ డాక్టర్లు అస్మా మౌనిక రజిత ప్రఫూల్ ఎస్ ఓ రాజ్ కుమార్, డాక్టర్ సుస్మిత ఎంపీహెచ్ఓ వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
