విద్యార్థుల దృష్టి కెరీర్ మీదనే ఉండాలి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్
జగిత్యాల జులై 26 ( ప్రజా మంటలు)
విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో అశోక్ కుమార్ , సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, జగిత్యాలలో ప్రారంభించిన " పోలీస్ పాఠశాల కార్యక్రమం" శనివారం ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్ ఆధ్వర్యంలో గౌతమ్ మోడల్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు
ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థుల దృష్టి కేవలం కెరీర్ పైనే ఉండాలని అన్నారు.
ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ, గంజాయి వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే అవగాహన పెంపొందిస్తే, రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చు అనే ఉద్దేశంతో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆలోచన మేరకు *పోలీస్ పాఠశాల* అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించడo జరిగింది. అందులో బాగంగా శనివారం ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్ ఆద్వర్యం లో జిల్లా కేంద్రం లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పిల్లలకు సమాజం లో జరిగే సామాజిక అంశాలపై సరైన అవగాహన కల్పిస్తే, రేపటి సమాజం మరింత భద్రమవుతుంది అనే ఉద్దేశంతో పోలీస్ పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలు సురక్షిత ప్రయాణ పద్ధతులు ,రోడ్డు పై ఎలా సురక్షితంగా నడవాలి, రోడ్డు దాటేటపుడు పాటించవలసిన నియమాలు ,సైకిల్ నడిపేటప్పుడు, కుటుంబ సభ్యులతో కార్, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలు,హెల్మెట్, సీటుబెల్ట్ వాడక ప్రాముఖ్యత,రోడ్ల పై మొబైల్ వాడకం వల్ల జరిగే ప్రమాదాలు,రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు,అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు అవగాహన కల్పించడం జరిగినది.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురి అయినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. ప్రస్తుతo Digital arrest , Job Fraud , Cyber slavery, Cyber stalking ,APK ఫైల్ని ఉపయోగించి నకిలీ కస్టమర్ కేర్ మోసాలు, ఎక్కువగా జరుగుతున్నాయని వీటి పైన జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. విద్యార్థులు తమ దృష్టి కెరీర్ మీద మాత్రమే ఉండాలని,నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వారికి వివరించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి వారియర్స్ గా పని చేయాలని కోరారు.
ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుంధతి మరియు ట్రాఫిక్ సిబ్బంది సంతోష్ ,లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
