భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు)
లైంగిక వేధింపులు, గృహహింసకు, అత్యాచారo కు గురైన బాధితులకు న్యాయ, వైద్య, మరియు సైకాలజికల్ సపోర్టు వంటి సేవలు ఒకే దగ్గర అందించాలన్న సంకల్పంతో భరోసా కేంద్రాని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు.
శనివారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో భరోసా సెంటర్ యొక్క పని తీరు మరయు బాదిత మహిళలకు అందుతున్న సేవల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్ లో కల్పించే న్యాయ సలహాలు,సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు,మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.పొక్సో, అత్యాచారా కేసులలో బాధితులను హక్కున చేర్చుకొని, వారిలో ధైర్యాన్ని నింపి, వారి సమస్యకు సత్వర పరిష్కారం దిశగా అన్నిరకాల సేవలను భరోసా సెంటర్ నందు అందించాలని అన్నారు.
డ్యూటీ పరంగా ఎలాంటి సమస్యలున్న మా దృష్టికి తీసుకురావాలని, ఒక్కొక్క విభాగానికి చెందిన సిబ్బంది అందిస్తున్న సేవలను వివరంగా అడిగి తెలుసుకొని, తగు సలహాలు సూచనలు చేశారు.
భరోసా సిబ్బందిని ఉద్దేశించి ఎస్పి మాట్లాడుతూ బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, రాత్రి పగలు అని తేడా లేకుండా ఎళ్లవేలలా పిల్లల, మహిళల రక్షణకు అందుబాటులో ఉండాలని సూచించారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయకుండా అన్ని శాఖల అధికారులతో కో-ఆర్డినేషన్ తో విధులు నిర్వహించాలని అన్నారు.
భరోసా సెంటర్ సేవల గురించి జిల్లాలో విద్యార్థులకు, మహిళలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించలని భరోసా సెంటర్ సిబ్బందికి సూచించారు.జిల్లాలో భరోసా సెంటర్ ప్రారంభమైన నాటి నుండి సత్ ఫలితాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న భరోసా సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఈ సమీక్ష సమావేశం లో సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్
అనూష ,లీగల్ అడ్వయిజర్ మౌనిక,భరోసా సిబ్బంది సుజాత ,ప్రతిబా, సునీత, లక్ష్మీ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
