ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి జూలై 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన వికలాంగుడు అత్తెన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన మంజూరు పత్రాన్ని గురువారంరాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజమల్లుకు అందజేసారు.
గతంలో ఎండపెల్లి మండల పర్యటనలో ఉన్న సమయంలో రాజమల్లు మంత్రి ని కలిసి తనకు ఇల్లు కావాలని కోరగా, మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి త్వరలో ఇంటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ ఇళ్లు మంజూరు పత్రాన్ని ప్రత్యక్షంగా అందించి రాజమల్లుకు అండగా నిలిచారు.
ఈ సందర్భంగా తాను కోరిన వెంటనే స్పందించి ఇల్లును మంజూరు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రాజమల్లు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, తాసిల్దార్ కటకం వరందన్, ఎంపిడిఓ రామ్ రెడ్డి, ఆర్ఐ అనూష కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
