స్థానిక ఎన్నికలపై బీజేపీ ముందస్తు కార్యశాల
ఇబ్రహీంపట్నం జూలై 24( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలలో ఎంపిటిసి జడ్పిటిసి ఎలక్షన్లపై ముందస్తు మండల కార్యశాలను మండల బిజెపి అధ్యక్షులు బాయి లింగ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఇబ్రహీంపట్నం మండల బిజెపి ఇంచార్జి Dr వెంకట్ రెడ్డి, మండల ప్రభారీ ధోనికెలా నవీన్ పాల్గొన్నారు, వీరు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ధర్మం వైపు మొగ్గు చూపుతుందని,నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇస్తున్నారు అని, బిజెపి లో కుటుంబ పాలన లేదని, స్థానిక ఎన్నికలలో విజయం సాధించే దిశగా కార్యకర్తలు పని చేయాలని కోరారు.
దేశంలో ప్రతి పౌరుడు దేశాభివృద్ధికై పాటుపడాలని,దేశంలో ప్రతి పౌరుడి ఎదుగుదలే బిజెపి లక్ష్యమని, అది మనం నమ్మిన సనాతన ధర్మం తోనే సాధ్యమౌతుందని, మరియు త్వరలో రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బిజెపి కే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, నేటి నుండి బిజెపి ప్రతి కార్యకర్త ఒక ఆయుధం గా మారి స్థానిక ఎన్నికల్లో బీజేపి అంటే ఏంటో చూపాలని, రానున్న ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ, మరియు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని అన్నారు .
కార్యక్రమంలో మండలం ప్రధాన కార్యదర్శులు సుంచు రణధీర్, పంతంగి వెంకటేష్ యాదవ్, జిల్లా నాయకులు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్,మండల నాయకులు, శక్తి కేంద్రం ఇంచార్జ్, బూత్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
