గత ప్రభుత్వ పెద్దలు ధర్మపురి పట్టణంలో తాగునీటిని సరఫరా చేయడంలో విఫలం - మంత్రి అడ్లూరి
ధర్మపురి జూలై 19 ( ప్రజా మంటలు):
ప్రభుత్వ పెద్దలు తలాపున గోదావరి ఉన్న పట్టణంలో తాగునీటిని సరఫరా చేయడంలో విఫలమయ్యారని,రాబోయే రోజుల్లో పట్టణంలో శాశ్వత మంచినీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
ధర్మపురి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజిటెబుల్ మార్కెట్ను స్థానిక నాయకులు,అధికారులతో కలిసి శనివారం రోజున రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రజలకు,రైతులకు అందుబాటులోకి రాకపోవడం బాధాకరమనీ,మార్కెట్లో షెడ్ లలో నిర్మించిన గద్దెలు ఎత్తుగా వుండడంతో అమ్మకాలు జరిపేందుకు ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రైతులు,కూరగాయల వ్యాపారులు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.
సమస్యను మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని,మున్సిపల్ శాఖ అధికారులు,స్థానిక రైతులు, కూరగాయల వ్యాపారులతో మాట్లాడి వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులుకు సూచించడం జరిగిందని ఆయన ఆన్నారు.
అమృత్ పథకంలో భాగంగా మార్కెట్ అవరణతో పాటు,మాతశిశు హాస్పిటల్ ఆవరణలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనుల కూడా వేగంగా కొనసాగుతున్నాయని,పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని,బోల్ చెరువుతోపాటు,అమృత్ పథకంలో భాగంగా వాటర్ ట్యాంక్ లను ఏర్పాటు చేయడంతోపాటు, అక్కపెళ్లి రిజర్వాయర్ను పూర్తిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘనబట్ల దినేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
