తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత
హైదరాబాద్ జూలై 16:
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో ముగిసిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలనీ కెటిఆర్ సూచించారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కోసం పార్టీ తరఫున ఇన్‌ఛార్జీగా ఇకపై బొగ్గు గని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారు.
కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకుపోవాలని, సింగరేణి సమస్యలపై మరింత పెద్దఎత్తున పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు అనేక ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం.
పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి సంస్థ కోసం చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకుపోవాలన్న కేటీఆర్ సూచన.
పది సంవత్సరాల కాలంలో సింగరేణితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేశారు
కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలను తీవ్రంగా వ్యతిరేకించింది మన పార్టీ.
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అడ్డగోలుగా అమలు చేయడానికి వీలుకాని హామీలు ఇచ్చిన తీరుగానే సింగరేణికి కూడా మోసం చేసిందని, ఈ అంశాలను కార్మికుల దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయం.
సింగరేణి గనుల ప్రైవేటీకరణ కోసం బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై గళమెత్తాలని నిర్ణయం. బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు సహకారం అందిస్తుంది. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతుంది
కార్మికుల కోసం పార్టీ లీగల్ సెల్ కూడా పూర్తిస్థాయి అండగా ఉంటుంది. ఏ కార్మికునికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసినా.. చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ సెల్ సహకారం అందిస్తుంది త్వరలోనే సింగరేణి ప్రాంతంలో బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరపాలని నిర్ణయించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..??

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు
