వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పి అశోక్ కుమార్
కోరుట్ల జూన్ 25( ప్రజా మంటలు)
వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేశారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్ , క్రైం రికార్డు , ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్ లను పరిశీలించారు.
సర్కిల్ పరిదిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసులలో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్, ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, పరిశీలించారు. గ్రేవ్ కేసులలో ఫోక్సో కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ఎస్ ఓ పి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. 5s ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని,5s ఇంప్లిమెంటేషన్ చేయాలని సూచించారు.
సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఆయా ఎస్సై ల ద్వారా చర్యలు తీసుకోవాలని సురేష్ బాబుకి సూచించారు. తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలనీ సూచించారు. సర్కిల్ పరిదిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.
ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు.కమ్యూనిటీ పొలిసింగ్ లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు సైబర్ నేరాలు వివిధ సామాజిక అంశాలపై ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా సి సి కెమెరాలు యొక్క ప్రాముఖ్యత గురించి గ్రామాల్లో తెలియజేస్తూ ప్రతి గ్రామoలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా కోరుట్ల సర్కిల్ ఆవరణలో ఎస్పీ మొక్క ను నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డిఎస్పీ రాములు , డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల సి .ఐ సురేష్ బాబు ఎస్సై లు శ్రీకాంత్ శ్యామ్ రాజ్,నవీన్, రామచంద్రం, సుప్రియ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
