పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప, మహంకాళి అమ్మవార్లకు ఘనంగా పసక బోనం సమర్పణ
జగిత్యాల జూన్ 24 ( ప్రజా మంటలు)
పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బీరప్ప అక్క మహంకాళి స్వామివార్లకు పసక బోనం సమర్పించడం జరిగింది.
ఈ పసక బోనం ను ప్రతి సంవత్సరం కురుమల కుల దైవమైన బీరప్ప దేవునికి సమర్పించుకోవడం అనవాయితీగా జరుగుతుందనీ అన్నారు.
కురుమ కులస్తులు ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలు పడే ముందు వారి కులదైవం అయిన బీరప్ప మరియు అక్క మహంకాళి కి ఈ బోనం ను సమర్పించుకోవడం ద్వారా వారి యొక్క వృత్తి అయినటువంటి గొర్రెలు ,మేకల సంతతి అభివృద్ధి చెందాలని, వర్షాలు బాగా కురిసి పచ్చని గడ్డి మేత విరివిగా లభించాలని కోరుకుంటారు.
స్వామీ వార్లకు ఒగ్గు డోలు,డప్పు వాయిద్యాలతో బోనం సమర్పించి ,ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి మంచి పంటలు పండాలని ,అలాగే కురుమ కులస్తులు అందరూ బాగుండాలని ఆ దేవుళ్ళని వేడుకున్నారు.
జగిత్యాల పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పసక బోనం* కార్యక్రమంలో పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు పుల్ల మల్లయ్య ప్రధాన కార్యదర్శి పుల్ల మహేష్ ,ఉపాధ్యక్షుడు పుల్ల మహేష్, సంయుక్త కార్యదర్శి లోడెపు మల్లికార్జున్, కోశాధికారి మొగుళ్ల పోచమల్లయ్య, కార్యవర్గ సభ్యులు అలాగే కుల పెద్దలు అయిన పెద్ద కురుమ కుటుంబ సభ్యులు మరియు పట్టణ కురుమ సంఘం కుల సభ్యులు , ఒగ్గు కళాకారులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని,కార్యక్రమాన్ని విజయవంతం చేశారనీ నిర్వాహకులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
