పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలి బిసి విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి
కరీంనగర్ జూన్ 23 ( ప్రజా మంటలు)
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ అందలేదని 2021-22 సంవత్సరం నుండి జిల్లా బీసీ సంక్షేమ శాఖలో 114 కోట్ల రూపాయల వరకు బకాయిలు పేరుకు పోయాయని తెలిపారు. విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీనితో చివరి సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని అన్నారు.గత మూడు సంత్సరముల నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల
చేయకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల అని ప్రకటన ఇస్తుందే తప్ప అవి కళాశాలలకు మాత్రం రావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మాటలు కోటలు దాటుతాయి తప్ప చేతలు మాత్రం గడప దాటటం లేదని ఎద్దేవా చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యార్థులను అలాగే యాజమాన్యాలను ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బియ్యని తిరుపతి,బిసి విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శులు రోహిత్, చింటు,అజయ్,సాయి,తదితర బిసి విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల జిల్లాలో దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

ఎర్రబెల్లి గ్రామంలో డ్వాక్రా మహిళల వనభోజనాల ఉత్సవం

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నిందితుని అరెస్ట్ 106 -ఫేక్ సర్టిఫికెట్స్,1 కంప్యూటర్, 1 ప్రింటర్ ,1 లామినేషన్ మెషిన్ స్వాధీనం

ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ కార్యాలయంలో ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

మహాలక్ష్మి పథకంలో ఉచిత ప్రయాణాల్లో 6680 కోట్లు మహిళలకు ఆదా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బస్తీల్లో పర్యటించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు
.jpg)
ఫిర్యాదుదారులను పోలీసులు బెదిరించడం మానుకోవాలి - రాష్ట HRC హెచ్చరిక

ఎమర్జెన్సీ పోరాట యోధులకు తీపి కబురు. స్వాతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు. భారత్ సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్

ఇబ్రహీంపట్నం ప్రథమిక వ్యవసాయ సహకార సంఘంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

గంగనాల అయకట్టు కు నీళ్లను విడుదల చేయించాలి

తెలంగాణవాది ప్రొఫెసర్ మధుసూధన్ రెడ్డి మృతి
