మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు
గొల్లపల్లి, జూన్ 11 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వివిధ సిబ్బందికి వేరువేరు రకాల ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు.
గొల్లపల్లి మండల కేంద్రంలో వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది (స్కావెంజర్) లకు ఒక రోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా రాయి శ్రీనివాస్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి జమున దేవి మాట్లాడుతూ పాఠశాల పరిసరాలు మొత్తం బోధనాభ్యసనకు అనుకూలంగా ఉండడమనేది కేవలం పాఠశాల స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందని, అట్టి ప్రధానమైన బాధ్యతను స్కావెంజర్లు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ సమయంలో పాఠశాల పున ప్రారంభం అవుతున్న దృష్ట్యా స్కావెంజర్ లు మరింతగా తమ బాధ్యతను పెంపొందించుకొని పాఠశాలను మరియు పరిసరాలను స్వచ్ఛగా ఉంచాలని, తద్వారా విద్యార్థులకు ఏ విధమైన వ్యాధులు ప్రబలకుండా నివారించినట్లు అవుతుందని అన్నారు.
ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ రాయి శ్రీనివాస్ స్వచ్ఛత, పరిశుభ్రత, పారిశుద్ధ్యం అనే అంశాలలో వివిధ పద్ధతులు మరియు స్కావెంజర్ లు పాటించవలసిన విధివిధానాలను వివరించారు.
మండల విద్యాశాఖ పరిధిలోని అన్నిపాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులకు FLN పైన శిక్షణ ఇచ్చి ఈ విద్యాసంవత్సరం లో సాధించబోయే అభ్యసన సామర్థ్యాలు మరియు పెట్టుకోవలసిన టార్గెట్ లు అనే దానిపై ఎం ఎన్ ఓ చెరుకు రాజన్న అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు
