సీఎం గారూ...బడి బాట సరే...మా బడికి దారేది....?
*స్కూల్ దారి కోసం బడిపంతులు ధర్నా
*బస్తీలోని పేద, దళిత విద్యార్థుల స్కూల్ పై వివక్ష
*స్కూల్ కు అడ్డంగా నిర్మించిన గోడ తొలగించాలని సీపీఐ నాయకులతో కలిసి నిరసన
సికింద్రాబాద్ మే 26 (ప్రజామంటలు) :
బడికి దారి కోసం బడిపంతులు ఆందోళనకు దిగారు. పేద పిల్లలు చదివే పాఠశాలకు కొందరు దారికి అడ్డంగా గోడ నిర్మించి దారిలేకుండా చేశారని, సీఎం గారూ..మాబడికి దారేది..అంటూ ప్లెక్సీతో నిరసన చేపట్టారు.పంతులు చేస్తున్న ఆందోళనకు సీపీఐ నాయకులు సంఘీభావం ప్రకటించి ఆయనతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ పాఠశాల కు అడ్డంగా అక్రమంగా నిర్మించిన గోడను తొలగించి బడికి బాట ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి , సీపీఐ నాయకులుతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ..పేద,దళిత వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలకు అడ్డంగా ప్రహరీగోడ నిర్మించారని, దీంతో విద్యార్థులకు స్కూల్లోని వెల్లడానికి దారి లేకుండా చేశారని అన్నారు.
ఈ విషయమై పాఠశాల ఉపాధ్యాయులు పలుమార్లు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించినా కోర్టు కేసును సాకుగా చూపి ఏడాది కాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు బస్తీలకు చెందిన దళిత, పేద విద్యార్థులను మా కాలానికి రావొద్దు అంటూ వివక్షకు గురి చేస్తూ అడ్డంగా అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను తొలగించి బడికి బాట ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు బడిబాట పేరుతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, బడికి దూరంగా ఉన్న పిల్లలను బడిలోకి చేర్చాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు బడికి దారి లేక ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తున్నారని అన్నారు.
సంవత్సర కాలం నుండి కలెక్టర్ నుండి జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ కింది స్థాయి అధికారి వరకు తిరిగినా పట్టించుకోవట్లేదని, జోనల్, కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ను టౌన్ ప్లానింగ్ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.ఈ విషయంలో అధికారులు స్పందించి గోడను కూల్చివేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ జయంతి వేడుకలు
.jpg)
శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి
