అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన - దావ వసంత సురేష్
రాయికల్ మే 23 (ప్రజా మంటలు)
మండలంలోని రాంనగర్ మరియు సింగర్ రావు పెట్ గ్రామాలలో అకాల వర్షాలతో తడిచిన వరి ధాన్యాన్ని రైతులు మరియు నాయకులతో కలిసి పరిశీలించి రైతులకు మద్దతుగా రోడ్డు పై బైఠాయించి నిరసన తెలియజేసిన జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన ధాన్యం తీర చేతికి అందేలోగా అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైందనీ, ప్రభుత్వం వెంటనే స్పందించి తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.
రేవంత్ ప్రభుత్వం రైతుని రాజుని చేస్తానని
రోడ్డు పాలు చేసిందని అన్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై ఎక్కడికి అక్కడ రైతులు ధర్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని గత బి ఆర్ ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్ నాయకులు చాంద్ రాజేశ్వర్ రెడ్డి జలపతి రెడ్డి గంగ రెడ్డి రాజమౌళి చంద్రయ్య శ్రీను రవి మల్లారెడ్డి నరేష్ లక్ష్మణ్ రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
