నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్
*ప్రారంభించిన యూఎస్ఏ కాన్సులెట్ జనరల్
సికింద్రాబాద్ ఏప్రిల్ 28 (ప్రజామంటలు) :
చిన్న వయస్సులోనే తన గొప్ప ఆలోచనకు కార్యరూపాన్ని ఇచ్చి, వరసగా ఓపెన్ లైబ్రరీలు ప్రారంభిస్తున్న చిన్నారి స్టూడెంట్ ఆకర్షణ నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందని హైదరాబాద్ లోని యూఎస్ఏ కాన్సులెట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. సోమవారం దమ్మాయిగూడ లోని జవహార్ నగర్ లో ఉన్న సేవాభారతి మహిళా శిక్షణ కేంద్రంలో 9వ తరగతి స్టూడెంట్ ఆకర్షణ ఏర్పాటు చేసిన లైబ్రరీని ఆమె ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ లైబ్రరీలో మొత్తం ఆరు వందల జనరల్ నాలెడ్జీ,తెలుగు ప్రేరణాత్మక కథలు, ఇంగ్లీష్ పుస్తకాలను ఉంచారు.
తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల నుంచి 14వేల 600 పుస్తకాలను ఆకర్షణ విరాళాల రూపంలో సేకరించడం గ్రేట్ అన్నారు. చిన్న వయస్సులో నిబద్దత కనబరుస్తూ, పుస్తకాలతో సమాజంలో పరివర్తన తేవాలనే ఆలోచన రావడం చాలా అరుదన్నారు. 13 ఏండ్ల ఆకర్షణ సతీష్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ఆకర్షణ తన 9ఏండ్ల వయస్సులో 2021 లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలు,క్యాన్సర్ ఆసుపత్రులు,పోలీస్ స్టేషన్లు,అనాధాశ్రయాలు, భరోసా కేంద్రం, జువైనెల్ హోమ్లు,ఎయిడ్స్ బాధిత పిల్లల కేంద్రాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేశారు.
గతంలో రాష్ర్టపతి, ప్రధానమంత్రి కూడ ఆకర్షణ గురించి తెలుసుకొని గుర్తించి, ప్రశంసించారు. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా న్యూఢిల్లీలో జరిగిన రాష్ర్టపతి, ప్రధాన మంత్రి ఎట్ హోమ్ కార్యక్రమాల్లో కూడ ఆకర్షణ పాల్గొంది. ఆకర్షణ ప్రారంభించబోయే తన 25వ లైబ్రరీకి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వస్తానని హామి కూడ ఇచ్చారు. త్వరలో హైదరాబాద్ మెట్రో స్టేషన్ లల్లో లైబ్రరీలను ప్రారంభించబోతున్నట్లు ఆకర్షణ సతీష్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
