మెట్పల్లి మం" ముత్యంపేట్ గ్రామం ప్యాక్ సెంటర్ మరియు మెట్ల చిట్టాపూర్. ఐకెపి వరి ధాన్యం సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ -21( ప్రజా మంటలు)
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. మెట్పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ మహిళా సమాఖ్య ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలోమరియు ముత్యంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలోవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్ గా చెక్ చేయాలని, తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని , నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని ఎలక్ట్రికల్ తూకం ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయాలని తెలిపారు
ధాన్యం తరలింపు సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ వడగళ్ల పడుతాయి కాబట్టి తాటి పత్రాలు అందుబాటులో తాగునీరు ఉండేలా చూడాలని.ఎలాంటిసమస్యలు రాకుండా ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అలాట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు.
ధాన్యం తరలింపు అంశంలో రవాణా సమస్య రాకుండా అవసరమైన లారీలును. కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు . ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ డాటా ఎంట్రీ చేయాలని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం నాణ్యత ప్రమాణాలు పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రేడే ఏ రకం ధాన్యానికి క్వింటాల్ 2320 రూపాయల, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్ 2300 రూపాయలు ఉంటుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేపట్టాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ డిఆర్డిఓ పిడి రఘువరన్ ఎంపీడీవో ఎమ్మార్వో శ్రీనివాస్ సివిల్ సప్లై అధికారులు మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
