శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయంలో ఘనంగా సత్సంగం ప్రారంభం
జగిత్యాల ఏప్రిల్ 19 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం
నిజామాబాద్ రోడ్ లోని, గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం,సమీపంలో ఐదు రోజుల క్రితం ప్రాణ ప్రతిష్ట జరిగిన అపురూప మైన పద్మావతి, గోదా,సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 54 మంది సభ్యులు కమిటీగా ఏర్పడి ఆలయం నిర్మించడం జరిగింది. స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం సత్సంగ్ జరపడానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నుండి ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు సత్సంగ్ జరపడానికి నిశ్చయించడం జరిగిందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు.ప్రముఖ జ్యోతిష,వాస్తు, పౌరాణిక,వేద, పండితులు,శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక, మరియు వారి మనుమడు నంబి వాసుదేవా చార్య, చేతుల మీదుగా ప్రతిష్ట జరిగిన ఈ దేవాలయం మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్వాహకులు యంసాని మహేష్, మరియు ట్రస్టు సభ్యులు, శ్రీ లక్ష్మీ గణేశా మందిరం కోటగిరి శ్రవణ్ కుమార్,బృందం, లక్ష్మి గణేష్ మాతృ మండలి కోటగిరి కళ, భక్త బృందం, చే సత్సంగం వందలాదిమంది సభ్యులచే ప్రారంభించడం జరిగింది. సత్సంగం అనంతరం గోవింద నామాలతో ఆలయం మారుమోగింది. అనంతరం భక్తులందరికీ నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈనాటి కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు భక్తులు , మాత లు, వివిధ సత్సంగాల సభ్యులు, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ

సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోలు... కలెక్టర్ సత్య ప్రసాద్
.jpg)
జాబితాపూర్ గ్రామంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే చే గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా పూలంగి సేవ, తులాభారం ,దీపాలంకరణ
.jpg)
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన కారు

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి
