లింగ నిర్ధారణ నిషేధ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా తౌటు రామచంద్రం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)
లింగ నిర్ధారణ పరీక్షలఫై నిషేధం విధించిన నాటి నుండి అనగా గత 30 సంవత్సరాలుగా లింగ నిర్ధారణ పరీక్షలు జరప వద్దని, ఎక్కడ ఇలాంటి పరీక్షలు జరిగినా, అడ్డుకోవాలని, ఇలాంటి పరీక్షలను కఠినంగా నిషేధించాలని, పోరాటం సలుపుతున్న సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం ను పి సి పి యన్ డి టి అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమించారు.
బ్రూన హత్యల నిషేధాన్ని కఠినంగా అమలు పరచాలని,ఎవరైనా ఇలాంటి పరీక్షలకు పాల్పడితే ఉక్కు పాదం మోపి కఠినంగా శిక్షించాలని, 30 సంవత్సరాలుగా ఈ విషయమై పోరాడుతున్న తవుటు రామచంద్రం, స్త్రీ పురుష నిష్పత్తిలో తేడాలు రాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రస్తుతం 1000 మగ 930 స్త్రీ నిష్పత్తి ఉందని, ఈ నిష్పత్తిలో తేడాలు సమసిపోవాలని, సమతుల్యత సాధించాలని అన్నారు. గత 30 సంవత్సరాలుగా పోరాడుతున్న తవుటు రామచంద్రం సేవలను, గుర్తించిన అధికారులు అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమించారని, తవుటు రామచంద్రం తెలిపారు.
మంగళవారం నాడు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో తౌటు రామచంద్రం మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలకు ఎవరు పాల్పడినా కఠినంగా శిక్షించాలని అన్నారు.ఈ సందర్భంగా తవుటు రామచంద్రం మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా కలెక్టర్ కు, రెవెన్యూ అధికారులకు, ఆరోగ్యశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
