రామ కథా శ్రవణం... ముక్తి దాయకం - డాక్టర్ సంగన భట్ల నరసయ్య
(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్)
శ్రీ సీతా రామ కథా శ్రవణం ముక్తి దాయకమని,
లబ్దప్రతిష్టులైన సాహితీ వేత్త, చారిత్రక సాహిత్య పరిశోధకులు, సంస్కృతాంధ్ర భాషా పండితులు, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి అధ్యక్షులు, సంగీతజ్ఞుులు, పౌరాణిక నాటక నటులు, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ ప్రాచ్య కళాశాల విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగన భట్ల నరసయ్య ఉద్ఘాటించారు. రామ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా క్షేత్రంలో గోదావరీ తీరాన వెలసిన రామాలయంలో, దేవాలయ వంశ పారంపర్య నిర్వాహకులు అర్చకులు తాడూరి రఘునాథ్ శర్మ ఆద్వర్యంలో శ్రీరామ నవమి వరకు
నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణ సందర్భంగా గురువారం డాక్టర్ నరసయ్య ఆధ్యాత్మిక ప్రవచనం గావిస్తూ, రామాయణ విశేషాలను వివరించారు. క్రౌంచ పక్షుల మృతి కళ్ళారా చూసిన మహాకవి వాల్మీకి
శోకం శ్లోకంగా, గ్రంథస్థ తొలి కావ్య రచనగా రూపు దిద్దుకున్న నేపథ్యాన్ని వివరించారు. ఉత్తర రామాయణం వాల్మీకి రాయలేదని ప్రక్షిప్తమని, ఉత్తర రామాయణ రచన అవాల్మీకమని సోదాహరణంగా వివరించారు. మానవ పరిణామ క్రమాన్ని తెలిపే మహా విష్ణువు అవతారాల గురించి వివరించారు. రామో విగ్రహవాన్ ధర్మః అంటూ మానవ ధర్మానికి ప్రతిరూపమైన రాముని గుణ గణాలను ఉదాత్త లక్షణాలను వివరించారు. ప్రధానంగా వాల్మీకి కృత రామాయణం, ఆధ్యాత్మ రామాయణం లలో పేర్కొన్న అంశాలను పరిచయం చేస్తూ, సరి పోలుస్తూ న భూతో న భవిష్యతిగా సోదాహరణంగా వివరించారు.
కార్యక్రమంలో నిర్వహణ బాధ్యులు తాడూరి బాల కిష్టయ్య, బలరాం, బాల చందర్, రఘునాథ్, మోహన్, ఆశ్విత్, మహిళా మండలి సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు భాగస్వాము లైనారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
