రాజకీయ దురంహాంకారంతో కేటీఆర్ బెదిరింపులు - ఏఐసీసీ మెంటర్ డా.కోట నీలిమ
సికింద్రాబాద్ ఏప్రిల్ 04 (ప్రజామంటలు):
బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం కోసం తహతహలాడుతూ, ఆక్రమంలో తమ రాజకీయ అపరిపక్వతను బయటపెట్టుకుంటున్నారని అని ఏఐసీసీ మెంబర్ డాక్టర్ కోట నీలిమ అన్నారు.ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుబడిదారులను, సామాన్య ప్రజలను బెదిరించడం, అభివృద్ధిని అడ్డుకోవడమనే సాకుతో భయపెట్టడం తగదన్నారు. హెచ్సీయూ నిరసనల నేపథ్యంలో ప్రస్తావనలోకి వచ్చిన కన్చ గచ్చిబౌలి ప్రాంతంలోని అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాలుపంచుకునే పెట్టుబడిదారులు, పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ. రామారావు చేసిన అసాధారణ ప్రకటనపై ఆమె స్పందించారు.
ప్రజాస్వామ్యంలో ఎలాంటి రాజకీయ పార్టీ ఇలాంటి బెదిరింపులు చేస్తుంది? ఇవి రాష్ట్ర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించే చర్యలు. తెలంగాణ ప్రజలు ఇలాంటి రాజకీయాలను అంగీకరించరు,’ అని నీలిమ అన్నారు కేటీ రామారావు రాజకీయ అజ్ఞానం, అధికారం కోసం ఆయన తహతహలను ఈ ప్రకటన బయటపెడుతోందని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ విధానాల నిరంతరతను మరియు అభివృద్ధి ప్రాజెక్టుల కొనసాగింపుని నమ్ముతుందని ఆమె అన్నారు.కేటీ రామారావు తన అవకాశవాద, వీకెండ్ స్టైల్ రాజకీయాలతో తెలంగాణ ప్రజలను పూర్తిగా గందరగోళానికి గురి చేశాడన్నారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది – ప్రజలు, సమస్యలు ఇవేమీ ఆయనకు ముఖ్యమైనవి కావు. ఆయనకు ఒక్కటే ముఖ్యం – రాజకీయ అధికారం.హెచ్సీయూ భూవివాదాలపై భవిష్యత్ దారిలో, నీలిమ ఇలా అన్నారు:
‘సంరక్షణ మరియు అభివృద్ధి రెండూ సాధ్యమే. ఇది చర్చ మరియు సంప్రదింపుల ద్వారా సాధించవచ్చు. ప్రభుత్వం ఒకతాటి కలిపే ప్రయత్నం చేస్తుంది, ఇది అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను తీసుకువస్తుంది.’ అని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
