కెవైసి ల పేరుతో గ్యాస్ ఏజెన్సీల దోపిడీ - పట్టించుకోని అధికారులు
- టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
జగిత్యాల ఎప్రిల్ 04:జగిత్యాల జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న కొందరు ఏజెన్సీల వారు కెవైసి, ఇతరత్రా కారణాల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆరోపించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్యాస్ ఏజెన్సీల వారు కెవైసీ, కొత్త పాస్ బుక్ ల పేరుతో, సిలిండర్లు ఇంటికి సప్లై చేసే రవాణా ఖర్చుల పేరుతో విచ్చల విడిగా దోపిడీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇంటికి గ్యాస్ బుడ్డి సరఫరా చేసినందుకు పట్టణ ప్రాంతాలలో రూ.20 నుండి 30 వరకు, గ్రామీణ ప్రాంతాలలో రూ.50 కి పైగా అధికంగా దోచుకోవడం జరుగుతుందన్నారు. ఇంత దోపిడీ జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
వంట గ్యాస్ వినియోగ దారులు ఎవరైనా ఇలాంటి దోపిడీకి న్... ఫోన్ కాల్స్ కు గురైతే.... స్థానిక తహసీల్దార్ లకు, ఆర్డివో లకు, జిల్లా కలెక్టర్ కు లేదా 1906 టోల్ ఫ్రీ, 18002333555 నంబర్ లకు కూడా పిర్యాదు చేయవచ్చునని చుక్క గంగారెడ్డి సూచించారు.
కొన్ని గ్యాస్ ఏజెన్సీల వారు ప్రత్యేకంగా పని గట్టుకొని ప్రత్యేక టెలికాలర్స్ ను ఏర్పాటు చేసుకొని ఫోన్ కాల్స్ చేయించి వారి ఏజెన్సీ కార్యాలయాలకే వినియోగదారులను పిలిపించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కెవైసి పేరుతో రూ.150 నుండి 200 వరకు, రబ్బర్ ట్యూబ్ మార్పిడి పేరుతో రూ.500 వరకు, ఇంటికి వచ్చి గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్ చెక్ చేయకున్నా చేసినట్లు ఆపీసుల్లోనే ఫామ్స్ నింపుకొని సర్వీస్ చార్జీల పేరుతో మరింత దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కొత్త డొమెస్టిక్ గ్యాస్ కస్టమర్ కార్డుల పేరుతో కూడా అదనంగా రూ.150 నుండి 200 వరకు వినియోగ దారుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని తనతో పలువురు బాధితులు వాపోయినట్లు చుక్క గంగారెడ్డి వివరించారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని, దోపిడీకి గురైన వినియోగ దారులకు తిరిగి డబ్బులు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో బాధిత ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
