బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఘన నివాళులు
జగిత్యాల ఏప్రిల్ 3 (ప్రజా మంటలు)
బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు.
దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమురయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి, బొమ్మిడి నరేష్ కుమార్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు రాపర్తి రవి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బండపెల్లి నర్సయ్య, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
