సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని
On

*ఆదర్శంగా శ్రీనివాస సమాజ సేవ ఛారిటబుల్ట్రస్ట్
సికింద్రాబాద్, ఏప్రిల్ 01 (ప్రజామంటలు) :
వయస్సు పైబడిన కూడ పేద ప్రజలకు సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం చాల గొప్పదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్ లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత బోజన పంపిణీ, చలివేంద్రం లను ఆయన ప్రారంభించారు. నేటి నుండి రెండు నెలల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయని నిర్వహకులు వివరించారు. పలువురికి భోజనం వడ్డించడమే కాకుండా ఆయన కూడా భోజనం చేసి ఎంతో రుచికరంగా, నాణ్యతతో బోజనాన్ని ఉచితంగా వడ్డిస్తూ అనేకమంది ఆకలి తీరుస్తున్న నిర్వహకులను అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజర్లను అభినందించారు.
నిత్యం 250 మందికి....రెండు నెలల పాటు..
రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తమ శ్రీనివాస సమాజ సేవ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది వేసవిలో ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయాలని నిర్ణయించుకొని, 15 ఏండ్ల క్రితం ఈ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 65 నుండి 95 సంవత్సరాల వయసు కలిగిన 170 మంది సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ గా ఏర్పడి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి వేసవిలో రెండు నెలల మండు టెండల కాలం పాటు ప్రత్యేక టెంట్ వేసి, నిత్యం 250 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇంట్లో వండిన మాదిరిగానే రెండు కూరలు, సాంబారు, మిర్చిబజ్జి, పెరుగు, తదితర పదార్థాలతో రుచికరంగా వంటలు చేస్తూ బోజనం పెడుతున్నారు. అలాగే ఇక్కడే చలివేంద్రాన్ని కూడ ఏర్పాటు చేశారు. అయితే ఈ రెండు నెలల పాటు ప్రతి రోజు ఒక దాత ముందుకొచ్చి, అన్నదానం ఖర్చును భరిస్తారు. తమ పుట్టిన రోజు,తమ వారి జ్ఞాపకార్థం, ఇలా పలు రకాల విశేషమైన రోజుల సందర్బంగా తమకు నచ్చిన ఒక రోజును ఎంపిక చేసుకొన్న దాతలు ఆ రోజున అన్నదానం స్పాన్సర్ చేస్తున్నారు. పేద విద్యార్ధులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ, హెల్త్ క్యాంప్ ల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ వయస్సును సైతం లెక్క చేయకుండా సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సాయం ఎప్పటికీ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ హామినిచ్చారు. సీనియర్ సిటిజన్స్ తమ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొనే కౌన్సిల్ లోని పలువురు సభ్యులు కరోనా సమయంలో మరణించారని, వారు గుర్తుకొచ్చినప్పుడు తన మనసుకు ఎంతో బాధ కలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, డాక్టర్ లు సుష్మ, ప్రియాంక, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అద్యక్షుడు దూబే, మాజీ అద్యక్షులు మాణిక్ రావ్ పాటిల్, సభ్యులు సహదేవ్ గౌడ్, కృష్ణ దేవ్ గౌడ్, కృష్ణా రెడ్డి, జె.ప్రసాద్, శంకర్, రామలింగం, అనంతరెడ్డి, నాయకులు కర్ణాకర్ రెడ్డి, ఖలీల్, గోపిలాల్ చౌహాన్, కూతురు నర్సింహ, బలరాం పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
Published On
By Kasireddy Adireddy

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
Published On
By Special Reporter

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం
Published On
By Special Reporter

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
Published On
By Special Reporter

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం
Published On
By Siricilla Rajendar sharma

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు
Published On
By Special Reporter

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం
Published On
By Special Reporter

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము
Published On
By Special Reporter

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా
Published On
By Special Reporter

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
Published On
By Special Reporter
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
Published On
By Special Reporter

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
Published On
By Special Reporter
