వృద్దాప్యంలో దంత సమస్యలకు ఆధునిక పరిష్కారం.
-డాక్టర్ హరి విక్రమ్ సిసీనియర్ దంతవైద్య నిపుణులు,ఇంప్లాటాలజిస్ట్
టీపీసీఏ ఆధ్వర్యంలో సీనియర్ సిటీజేన్స్ కు దంత సమస్యల పరిష్కారంపై అవగాహన సదస్సు.
జగిత్యాల సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు): వృద్దాప్యంలో దంత సమస్యలు తీవ్ర దుష్ప్రభావాలను చూపుతాయని జగిత్యాల జిల్లా కేంద్రం బ్రహ్మాణవాడలో ఉన్న అభిషేక్ సూపర్ స్పెషాలిటీ దంతవైద్య శాల ఇంప్లాంట్ సెంటర్ సీనియర్ దంత వైద్య నిపుణులు డాక్టర్ హరి విక్రమ్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ కార్యాలయంలో పెన్షనర్లకు,సీనియర్ సిటిజెన్లకు దంత సమస్యల పరిష్కారముపై అవగాహన కల్పించారు.
డాక్టర్ హరి విక్రమ్ మాట్లాడుతూ దేశంలో 60 ఏళ్ళు దాటిన వారిలో పూర్తిగా దంతాలు కోల్పోయే వారు సుమారు 30 నుంచి 40 శాతం మంది ఉంటారన్నారు.నోటి ఆరోగ్య సంరక్షణ ను నిర్లక్ష్యం చేస్తే దంతాలు త్వరగా ఊడిపోతాయని,వృద్దాప్యంలో ఎదురవుతున్న దంత సమస్యలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం లభిస్తుందన్నారు.నోటి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వక పోతే వయసు పై బడుతున్న కొద్దీ దంతాలు ఊడిపోతాయన్నారు.
ధీన్తో ఆహారాన్ని సరిగా నమిలితినలేని పరిస్థితి ఉంటుందన్నారు.ముఖంలోనూ మార్పులు కనిపిస్తుంటాయని,ఈ సమస్యలకు ఇప్పుడున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కృత్రిమ దంతాలను అమర్చవచ్చన్నారు. కట్టుడు దంతాల మాదిరిగా కాకుండా ఇప్పుడు వస్తున్న అధునాతన ఇంప్లాంట్లు సహజ సిద్ధంగా అమరుతాయని చెబుతూ పిల్లలకు,పెద్దలకు కలుగుతున్న పలు దంత సమస్యలు..పరిష్కారంపై వివరించారు.
ఈ కార్యక్రమంలో టీ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి పి.హన్మంత్ రెడ్డి,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కే.సత్యనారాయణ,సంయుక్త కార్యదర్శులు దిండిగాల విఠల్,కట్ట గంగాధర్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి రాజ్ మోహన్,జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,మల్యాల అధ్యక్షుడు ఎం.డి.యాకూబ్,కార్యదర్శి వీరారెడ్డి,రాయికల్ అధ్యక్షుడు వై.వేణుగోపాల్ రావు,మెట్ పల్లి అధ్యక్షుడు మురళి,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు

గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక
