వైద్య విద్య మెరుగుకు ఎన్ఎంసి, ఐఎంఏ కలిసి చేయాలి
ఎన్ ఎం సి చైర్మన్ డాక్టర్ అభిజిత్ సేఠ్
స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో ప్రొఫెసర్ విశ్వ రెడ్డికి ఎక్సలెన్సీ అవార్డు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):
వైద్య విద్యలో నాణ్యత పెంచేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎం సి), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లు కలిసి పనిచేయాలని ఎన్ ఎం సి చైర్మన్ డాక్టర్ అభిజిత్ సేఠ్ సూచించారు. హైదరాబాద్ సిటీ ఐఎంఏ 86వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోఠి లో ఆధునికరించిన ఐఎంఏ నగర శాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఐఎంఎ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కాంపిటీషన్ లో " ఫ్యూచర్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్స్ ఇన్ ఇండియా" అనే అంశంపై ఉత్తమ వ్యాసం రాసినందుకు హైదరాబాదుకు చెందిన ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వ రెడ్డికి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ పురస్కారం లభించింది. ఈ మేరకు ఎన్ఎంసి జాతీయ చైర్మన్ డాక్టర్ అభిజిత్ సెట్ ఆమెకు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు పురస్కార గ్రహీత డాక్టర్ విశ్వ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి,అభినందించారు.
డాక్టర్ దిలీప్ భానుశాలి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి హైదరాబాద్ నగర అధ్యక్షులు డాక్టర్ శ్రీరంగ అబ్కారీ, టి ఎం సి చైర్మన్ తదితరులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఐజి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ అశోక్, డాక్టర్ గట్టు శ్రీనివాసులు, డాక్టర్ నరేందర్ రెడ్డి, డాక్టర్ విజయ రావు, డాక్టర్ దయాల్ సింగ్, డాక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
